Pushpa Keshava : పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. మన సరిహద్దులు దాటి ఖండాలు దాటి బన్నీ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. పుష్ప రాజ్‌లా మారిపోయారంతా. డైలాగ్స్, స్టెప్పులు వేస్తూ పుష్ప రాజ్‌ను ఇమిటేట్ చేశారు. శ్రీవల్లి స్టెప్పులు వేసినా, తగ్గేదేలే అనే డైలాగ్ చెప్పినా కూడా అది బన్నీ వేసిన ముద్రే. అలా పుష్ప చిత్రంతో బన్నీ నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్‌గా క్రేజ్ దక్కించుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే పుష్ప పాత్రతో పాటుగా కేశవ కారెక్టర్ కూడా ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. కేశవ పాత్రతోనే సినిమాలో ఫన్ ఉంటుంది. పుష్ప అసిస్టెంట్‌గా కేశవ పోషించిన పాత్ర అదిరిపోయింది. ఆ కారెక్టర్లో ముందుగా మహేష్‌ విట్టాను అనుకున్నారట. కానీ చివరకు జగదీష్ ప్రతాప్ భండారి వచ్చాడు. ఆ పాత్రను అద్భుతంగా పోషించేశాడు.


పుష్ప చిత్రం వచ్చాక అంతా కూడా కేశవ పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. కేశవ పాత్రను చూసి మిగిలిన వారంతా కూడా జగదీష్‌కు ఆఫర్లు ఇచ్చారు. ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో కేశవ బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు సైమా అవార్డుల్లో కేశవ పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఉత్తమ సహాయకుడిగా జగదీష్ అవార్డు అందుకున్నాడు.


 


 



ఇక స్టేజ్ మీద మాట్లాడుతూ జగదీష్ ఏడ్చేశాడు. అందరినీ ఏడిపించేశాడు. తన అమ్మకు ఐ లవ్యూ చెప్పాడు.. సినిమాల్లోకి వస్తానంటే నాన్న సపోర్ట్ చేయలేదు.. చేయడు కూడా.. కానీ నువ్ సపోర్ట్ చేశావ్ అమ్మా.. థాంక్యూ.. నాకు ఇది తప్పా ఇంకేం రాదు.. ఏం చేసినా ఇక్కడే చేస్తాను.. చచ్చినా బతికినా ఇక్కడే.. సారీ నాన్నా.. నువ్ చెప్పిందేదీ కూడా నేను చేయలేదు అంటూ జగదీష్ కంటతడి పెట్టేసుకున్నాడు. ఆ తరువాత పాట పాడి అందరినీ నవ్వించేశాడు.


Also Read : Amitabh Bachchan - Chiranjeevi : చిరుని పట్టించుకోని అమితాబ్


Also Read : RC 15 : దిల్ రాజు టీం అశ్రద్ద.. రామ్ చరణ్ అంజలి పిక్స్ లీక్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook