RC 15 : దెబ్బ మీద దెబ్బ.. దిల్ రాజు టీం అశ్రద్ద.. రామ్ చరణ్ అంజలి పిక్స్ లీక్

Ram Charan And Anjali Pics Leaked రామ్ చరణ్ అంజలి జంటగా ఉన్న ఫోటోలు, అవి కూడా 80వ దశకంలో దిగిన ఫోటోల్లా కనిపిస్తున్నాయి. rc 15 సెట్ నుంచి ఈ ఫోటోలు లీక్ అయినట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2022, 07:57 AM IST
  • రాజమండ్రిలో Rc15 షూటింగ్
  • రామ్ చరణ్ అంజలి పిక్స్ లీక్
  • దిల్ రాజు టీం చర్యలేవీ?
RC 15 : దెబ్బ మీద దెబ్బ.. దిల్ రాజు టీం అశ్రద్ద.. రామ్ చరణ్ అంజలి పిక్స్ లీక్

Ram Charan And Anjali Pics Leaked : రామ్ చరణ్ అంజలి కలిసి శంకర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. Rc15 కోసం రామ్ చరణ్ వివిద గెటప్పులు వేస్తోన్నాడని తెలిసిందే. ఇప్పటికే మూడు రకాల లుక్స్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. రాజమండ్రి, పుణె, వైజాగ్, అమృత్ సర్ ఇలా ఎక్కడ షూటింగ్ జరిగినా కూడా ఆ లొకేషన్ నుంచి ఫోటోలు లీక్ అవుతూనే వస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజమండ్రి షెడ్యూల్ నుంచి పంచెకట్టులో రామ్ చరణ్ లుక్స్, సైకిల్ మీద వెళ్తున్న వీడియోలు నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

దిల్ రాజు టీం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని సార్లు హెచ్చరించినా కూడా షూటింగ్ స్పాట్ నుంచి ఫోటోలు లీక్ అవుతున్నాయి. తద్వారా రామ్ చరణ్ లుక్స్ బయటకు వచ్చేస్తున్నాయి. రామ్ చరణ్ గెటప్స్, లుక్స్ చూస్తే శంకర్ ఏదో మ్యాజిక్ చేయబోతోన్నట్టుగానే కనిపిస్తోంది. మొత్తంగా మూడు గెటప్పులో రామ్ చరణ్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. గ్రామంలో పెద్దగా, కాలేజ్ కుర్రాడిలా, సిన్సియర్ ఐపీఎస్ అధికారిగా ఇలా పలు షేడ్స్‌లో రామ్ చరణ్ కనిపించనున్నాడు.

అయితే ప్రస్తుతం Rc15 టీం రాజమండ్రికి వెళ్లింది. అక్కడ రామ్ చరణ్ అంజలి మీద కొన్ని సీన్లను తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఇందులో రామ్ చరణ్‌ అంజలి భార్యాభర్తలుగా కనిపించబోతోన్నారు. ఇక వీరికి ఓ కొడుకు కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూస్తుంటే 80, 90వ దశకానికి చెందిన వారుగా కనిపిస్తున్నారు. అంజలి, రామ్ చరణ్ మేకోవర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

అయితే ఈ ఫోటోలు మాత్రం నెట్టింట్లో విపరీతంగా షేర్ అవుతూనే ఉన్నాయి. దిల్ రాజు టీం మాత్రం ఈ లీకుల పట్ల చాలా సీరియస్ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే లీకులు ఎలా అవుతున్నాయి.. ఎవరు చేస్తున్నారో తెలియడం లేదట. సినిమా మీద హైప్ తీసుకురావడానికి చిత్రయూనిటే ఇలా చేసి ఉండొచ్చుఅని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మొత్తానికి రామ్ చరణ్ కెరీర్లో 15వ సినిమాగా..  ఎస్వీసీ బ్యానర్లో 50వ సినిమాగా ఈ చిత్రం రాబోతోంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన డీల్స్ పూర్తయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ స్థాయిలో ఈ మూవీ బిజినెస్ జరిగింది. దాదాపు 500 కోట్ల వరకు డీలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి అధికారి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.

Also Read : Bollywood Affairs: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి కాకముందే బ్రేకప్ చెప్పుకున్న జంటలు

Also Read : Unstoppable with NBK Promo : చంద్రబాబు ముందు నారా లోకేష్ రొమాంటిక్ పర్సనల్ ఫోటోలు.. షోలో చెడుగుడు ఆడేసుకున్న బాలయ్య

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News