pushpa movie update: స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప(Pushpa Movie)’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో బన్నీ(Allu Arjun) పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక(Rashmika Mandanna)ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను #SoulmateOfPushpa పేరుతో చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో రష్మిక శ్రీవల్లి అనే పాత్రలో మెప్పించనున్నారు. పోస్టర్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమాలో ఆమె డీగ్లామర్‌ రోల్‌ పోషించినట్లు తెలుస్తోంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి సుకుమార్(Sukumar) దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ-సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌(Fahad Fazil) ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ఇంట్రడ్యూసింగ్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన దాక్కో దాక్కో మేక సాంగ్ యూట్యూబ్‏లో రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. క్రిస్మస్‌(Christmas‌) కానుకగా డిసెంబర్‌ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.


Also Read: Shahid Kapoor: ఆమెతో కలిసి నటించడమే నా కల: షాహిద్ కపూర్


 ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. ఇందులో రెండు పాటలు, కొన్ని యాక్షన్ సన్నివేశాలు అక్కడే చిత్రీకరించాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్‏కు బ్రేక్ పడిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్(Gulab cyclone) కారణంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా షూటింగ్ జరిపే అవకాశం లేదని.. అందుకే పరిస్థితులు మెరుగుపడే వరకు షూటింగ్ వాయిదా వేయాలని చూస్తున్నారట మేకర్స్. ఒకవేళ పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. అక్టోబర్ చివరి నాటికి సినిమా పూర్తిచేయడం కష్టమే అంటున్నారు . దీంతో ఈ వర్షాల ప్రభావం.. సినిమా రిలీజ్ డేట్ పై ఎఫెక్ట్ కానున్నట్లుగా టాక్ నడుస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


pple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook