Allu Arjun Pushpa Movie Release Date Announced: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ మూవీ(Pushpa Movie Latest Update) విడుదలకు సంబందించిన అప్‌డేట్ వచ్చింది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నారో మైత్రి మూవీ మేకర్స్, హీరో అల్లు అర్జున్ అప్‌డేట్ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పుష్ప మూవీ ఈ ఏడాది ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప విడుదల తేదీ(Pushpa Movie Release Date Update)ని పీఆర్వో బీఏ రాజు, మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు బన్నీ సైతం వెల్లడించారు. ఈ మేరకు తమ ట్విట్టర్ ఖాతాలలో పుష్ప సినిమా విడుదల తేదీకి సంబంధించిన పోస్టులు చేశారు.పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటి రష్మిక మందన్న నటిస్తోంది.


Also Read: Vijay Shankar Wedding Photos: పెళ్లిపీటలు ఎక్కిన Team India క్రికెటర్ విజయ్ శంకర్


 



 


 



 


స్మగ్లర్ టీమ్‌కు బాస్‌గా అల్లు అర్జున్(Allu Arjun) కనిపిస్తున్న ఫొటోను అల్లు అర్జున్ షేర్ చేశాడు. మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చుతున్నారు. ‘ఆగస్టు 13, 2021 తేదీన పుష్ప మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. నేను, సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ చేస్తుందని ఆశిస్తున్నాను’ అని తన ట్వీట్‌లో అల్లు అర్జున్ పేర్కొన్నారు.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook