తమిళనాడుకు చెందిన టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ (Vijay Shankar) ఓ ఇంటివాడయ్యాడు. వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు భారత క్రికెటర్ విజయ్ శంకర్. ఈ ఆల్ రౌండర్ క్రికెటర్‌కు తోటి క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Vijay Shankar Tied The Knot With Vaishali Visweswaran : తమిళనాడుకు చెందిన టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ (Vijay Shankar) ఓ ఇంటివాడయ్యాడు. వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు భారత క్రికెటర్ విజయ్ శంకర్. ఈ ఆల్ రౌండర్ క్రికెటర్‌కు తోటి క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Vijay Shankar Marries Vaishali Visweswaran | టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ బుధవారం నాడు వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వైశాలి విశ్వేశ్వరన్ వివాహం విజయ్ శంకర్‌తో జరిగింది. ముందుగా నిశ్చయించిన శుభముహూర్తాన విజయ్ శంకర్(Vijay Shankar Wedding News Update), వైశాలి విశ్వేశ్వరన్ పెళ్లిపీటలు ఎక్కారు. (Photo Source: Twitter) Also Read: IPL 2021: అత్యధికంగా ఆర్జించిన భారత క్రికెటర్లు వీరే
బుధవారం నాడు విజయ్ శంకర్, వైశాలి విశ్వేశ్వరన్(Vijay Shankar Weds Vaishali Visweswaran)లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల సభ్యులు, కొందరు సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. (Photo Source: Instagram)
తమ ఫ్రాంచైజీ ఆటగాడు విజయ్ శంకర్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ శుభాకాంక్షలు తెలిపింది. అయితే విజయ్ శంకర్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో తెలపలేదు. అయితే సన్నిహిత క్రికెటర్లు విజయ్ శంకర్ వివాహానికి సంబంధించిన ఫొటో బయటకు రాగానే శుభాకాంక్షల వెల్లువ మొదలుపెట్టారు. (Photo Source: Instagram) Also Read: Vijay Shankar Engagement Photos: వేడుకగా క్రికెటర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం
గతేడాది ఆగస్టులో వైశాలి విశ్వేశ్వరన్‌తో విజయ్ శంకర్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఐపీఎల్ 2020కు ముందు నిశ్చితార్థం (Vijay Shankar Engagement) చేసుకున్న విజయ్ శంకర్, ఈ విషయాన్ని అప్పట్లోనే వెల్లడించాడు. ఎంగేజ్మెంట్ అయినట్లు ప్రకటించాడు. (Photo Source: Instagram) Also Read: IPL 2021 Sunrisers Hyderabad: వచ్చే ఐపీఎల్లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు వీరే
2018లో కొలంబోలో శ్రీలంకతో జరిగిన టీ-20 మ్యాచ్ ద్వారా భారత్ తరపున విజయ్ శంకర్ అరంగేట్రం చేశాడు. భారత్ తరపున 12 వన్డేలు, తొమ్మిది టీ 20 మ్యచ్‌లు ఆడాడు. 2019 ఐసీసీ ప్రపంచ కప్ జట్టులో సభ్యుడు కూడా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021)లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. (Photo Source: Instagram)