Pushpa item song: అల్లు అర్జున్‌తో బాలీవుడ్ బ్యూటీ ఐటం సాంగ్
అల్లు అర్జున్ ( Allu Arjun ) తరువాత చిత్రం పుష్ప ( Pushpa movie ) ప్రకటించినప్పటి నుండి అభిమానులలో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రముఖ పోర్టల్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ( Shraddha Kapoor ) ప్రత్యేక పాటలో కనిపించి బన్ని అభిమానులను కనువిందు చేయనుంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) తరువాత చిత్రం పుష్ప ( Pushpa movie ) ప్రకటించినప్పటి నుండి అభిమానులలో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రముఖ పోర్టల్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ( Shraddha Kapoor ) ప్రత్యేక పాటలో కనిపించి బన్ని అభిమానులను కనువిందు చేయనుంది. ఫిలింనగర్ టాక్ ప్రకారం పుష్ప సినిమాలో శ్రద్ధా కపూర్ స్టైలిష్ స్టార్ సరసన స్టెప్ వేయబోతునట్టు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించే సినిమాలు అంటేనే ఇరగదీసే ఐటం సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్ అనే పేరు ఉండనే ఉంది. అలాగే పుష్ప సినిమాను సైతం మరింత కమర్షియల్ చేయడానికి ఒక ప్రత్యేక పాట కోసం శ్రద్ధాని ( Shraddha Kapoor's item song ) టాలివుడ్‌కి తీసుకురావడానికి యోచిస్తున్నట్లు సమాచారం. ఐతే, దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో సాహో సినిమాలో ప్రభాస్ సరసన జోడి కట్టిన ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను అంతగా అలరించలేదు. Also read : Rat caused fire accident: ఆఫీసుకు నిప్పు పెట్టిన ఎలుక.. కోటి రూపాయల నష్టం
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న ( Rashmika Mandanna ) జంటగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. 2021లో పుష్పను విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు. Also read : IPL 2020 logo: ఐపిఎల్ 2020 కొత్త లోగో వచ్చేసింది