Dakko Dakko Meka Song: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందిన 'పుష్ప' సినిమా డిసెంబరు 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై విశేష స్పందన తెచ్చుకుంది. అటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాడు 'పుష్ప'రాజ్. ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా చిత్ర విజయోత్సవ వేడుకలను చిత్రబృందం ఇటీవలే నిర్వహించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ పెద్దలు కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇటీవలే థియేటర్లలో విడుదలైన హిందీ చిత్రాల కంటే అల్లు అర్జున్ 'పుష్ప' అత్యధికంగా కలెక్షన్లు సాధించడం పట్ల మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ లోనూ తెలుగు సినిమా సత్తా మరోసారి చాటినట్లైంది.  


అయితే థియేటర్లలో వచ్చిన సందడితో పాటు సోషల్ మీడియాలో మరో సందడి చేసేందుకు పుష్ప మేకర్స్ సిద్ధమయ్యారు. సినిమాలోని తొలి సాంగ్ 'దాక్కో దాక్కో మేక' ఫుల్ వీడియోను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నద్ధమైంది. గురువారం (డిసెంబరు 30) ఉదయం 10.08 గంటలకు దాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ పాట ఫుల్​ వీడియోను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించారు. 



ఎర్ర చందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమా ఫస్ట్​ పార్ట్​ను క్రిస్మస్​ కానుకగా డిసెంబరు 17న విడుదల చేశారు. సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్​ మేకర్స్​ నిర్మించింది. రష్మిక కథానాయిక. దేవీశ్రీప్రసాద్​ స్వరాలు సమకూరుస్తున్నారు.   


Also Read: Sri Reddy Comments on Samantha: 'ఆమె బట్టలు విప్పినా అక్కడ ఏమి ఉండవు'.. సమంతపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు


Also Read: Guess Who is She: కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి