Pushpa The Rule Movie Launch: మెగాస్టార్ చేతుల మీదుగా పుష్ప 2 లాంచ్.. వాటికి చెక్ పెట్టడం కోసమే!
Pushpa The Rule Movie to be Launched By Megastar Chiranjeevi: తన పుట్టినరోజునే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయబోతున్నారని అంటున్నారు.
Pushpa The Rule Movie to be Launched By Megastar Chiranjeevi: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రూపొందిన పుష్ప ది రైజ్ మూవీ గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలై సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ వంటి వారు కీలక పాత్రలలో నటించారు.
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కేవలం తెలుగు భాషలో కాక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదలైంది. దక్షిణాది భాషల్లో ఎలా అయితే సూపర్ హిట్ గా నిలిచిందో? నార్త్ లో కూడా అంతకు మించి హిట్ కొట్టి దాదాపు పదిరెట్లు లాభాలు కూడా తెచ్చి పెట్టింది. నిజానికి ఈ సినిమాను మొదట ఒక్క భాగంగా తెరకెక్కించాలని అనుకున్నారని సినిమా నిడివి అంతకంతకూ పెరిగి పోతూ ఉండడంతో సినిమా రెండు భాగాలుగా విడుదల చేయాలనుకున్నారని అంటున్నారు.[[{"fid":"242291","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ పేరిట విడుదల చేశారు రెండో భాగాన్ని పుష్ప ది రూల్ పేరిట ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనే విషయం మీద ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదు. తాజాగా అల్లు అర్జున్ ఫాన్స్ అందరూ ఆనందపడే విధంగా ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చింది సినిమా యూనిట్. ఈ సినిమా పూజా కార్యక్రమాలు రేపు హైదరాబాద్ లో జరగబోతున్నాయని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
అయితే గత కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ మధ్య దూరం పెరుగుతుందని ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో సరిగ్గా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజునే అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమా ప్రారంభోత్సవం జరుగుతూ ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఈవెంట్ కు మెగాస్టార్ ను ముఖ్య అతిథిగా పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి బాబీతో ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పటికైనా తమ అభిమానుల మధ్య దూరం తగ్గించాలి అంటే ఇలా కలిసి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఇలా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇదంతా ఒక ప్రచారం అయితే ఈ కార్యక్రమాన్ని సాదాసీదాగా పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోందని, వచ్చే మూడు నెలల వరకు ఎలాంటి శుభ ముహూర్తాలు లేవు కాబట్టి మేకర్స్ ఇప్పుడే ప్రారంభిస్తున్నారని అంటున్నారు. అల్లు అర్జున్ యుఎస్‌లో ఉన్నారని, రేపటి లాంచ్‌కు హాజరుకావడం లేని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Read: Lavanya Thripathi Clarity on Marriage: వరుణ్ తో పెళ్లంటూ వార్తలు..అసలు విషయం చెప్పేసిన లావణ్య
Also Read: Most awaited Telugu films list: తెలుగు ఆడియన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల లిస్టు ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి