Laxmi Raai mourns her father's death: అధినాయకుడు, వేర్ ఇజ్ ద వెంకటలక్ష్మి వంటి సినిమాలలో నటించిన లక్ష్మీ రాయ్‌‌కి పితృవియోగం జరిగిన సంగతి తెలిసిందే. లక్ష్మీ రాయ్ తన తండ్రి రామ్‌ రాయ్‌‌ని ( Laxmi Raai's father Ram Raai ) బతికించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తంచేస్తూ సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ అందరినీ కదిలించి వేస్తోంది. తన తండ్రి ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని లక్ష్మీరాయ్ భావోద్వేగానికి గురయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'డాడీ ఐ మిస్ యూ.. నేను ఈ బాధను అధిగమించలేను కాని నేను ఈ లోటుతో జీవించడానికి ప్రయత్నిస్తాను. మీరు నన్ను ప్రేమించినట్లు ఇంకెవ్వరూ ప్రేమించలేదు. మా నాన్న ఇకలేరనే ఊహే గుండె ముక్కలయ్యేలా చేస్తోందని... మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనెంతో ప్రయత్నించాను కానీ రక్షించుకోలేకపోయాను ( Laxmi Raai's father died ). అందుకు నన్ను క్షమించండి నాన్నా’ అంటూ లక్ష్మీ రాయ్ ( Raai Laxmi ) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.


Also read : Allu Arjun, Trivikram: ఆహా కోసం అల్లు అర్జున్, త్రివిక్రమ్


అంతా బాగానే ఉంది అని చెప్పడానికి పక్కనే మీరు ఉంటే బాగుండేదని నా మనసు చెబుతోంది. మీరే నా వెన్నెముక, జీవితంలో నాకు ఏం కావాలన్నా ఇచ్చారు. నేను మీ కూతురిగా పుట్టడం నా అదృష్టం. నేనెప్పుడూ స్వేచ్ఛగా, దృఢంగా ఉండాలని మీరు ఎందుకు కోరుకునేవారో ఇప్పుడు అర్థమైంది. ఏదో ఒక రోజు మీరులేని లోటును నేను భరించాలని, తట్టుకోవాలని అలా చెప్పేవారు. ఇప్పుడు మీరు ఏ బాధలేని ప్రశాంతమైన చోటులో ఉన్నారని నా మైండ్‌కు తెలుసు. దీన్ని నా మనసుకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా. మీరు పై నుంచి నన్ను ఆశీర్వదిస్తారని, ముందుకు నడిపిస్తారని నాకు తెలుసు అని లక్ష్మీ రాయ్ తన తండ్రిని స్మరించుకుంది.


మీరు నన్ను నమ్మారు. మీరు కోరిన కోర్కెలను మీ కూతురు తప్పకుండా నెరవేరుస్తుంది, మీరు గర్వించేలా చేస్తుంది. బంగారు మనసున్న వ్యక్తి హృదయం కొట్టుకోవడం ఆగిపోయింది.. ఇది నా జీవితంలోనే అంధకారంతో కూడుకున్న సమయం. ఆయన ఇంత నొప్పిని భరించడం ఇష్టంలేక దేవుడు తనతో తీసుకెళ్లాడు. మా నాన్న ఎప్పుడూ మాతోనే ఉంటారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మిమ్మల్ని మేం ఎంతో మిస్‌ అవుతున్నాం. ఐ లవ్‌ యూ..’ అని లక్ష్మి రాయ్ బరువెక్కిన హృదయంతో తన మనసులోని బాధను ఇలా ఇన్‌స్టా పోస్ట్ ద్వారా పంచుకుంది.


Also read : Samantha hosting Sam Jam: 'సామ్ జామ్' అంటున్న సమంత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link -  https://apple.co/3loQYe