Allu Arjun, Trivikram: ఆహా కోసం అల్లు అర్జున్, త్రివిక్రమ్

Allu Arjun, Trivikram for Aha: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంటపురంలో ( Ala vaikuntapuramlo ) సినిమా బ్లాక్ బస్టర్ అయింది. 

Last Updated : Nov 8, 2020, 01:44 AM IST
Allu Arjun, Trivikram: ఆహా కోసం అల్లు అర్జున్, త్రివిక్రమ్

Allu Arjun, Trivikram for Aha: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంటపురంలో ( Ala vaikuntapuramlo ) సినిమా బ్లాక్ బస్టర్ అయింది. గతంలో వీళ్లిద్దకి కాంబోలో వచ్చిన జులాయి, s/o సత్యమూర్తి సినిమాలు టాలీవుడ్ ఆడియెన్స్‌ని ఎంత ఎంటర్‌టైన్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలావుండగా తాజాగా వీళ్లిద్దరూ మరోసారి చేతులు కలపబోతున్నారు. ఐతే ఈసారి 70 ఎంఎం థియేటర్ కోసం కాకుండా.. ఆహా ఓటిటి ప్లాట్‌ఫాం కోసం. అల్లు అరవింద్ ( Allu Aravind ) సొంత ఒటిటి ప్లాట్‌ఫాం ఆహా ప్రమోషనల్ వీడియోల కోసం వీరిద్దరూ మరోసారి చేతులు కలిపారు.

తాజాగా ఆహాకి త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ( Allu Arjun ) కలిసి ప్రమోషన్ యాడ్ చేశారు. దీపావళికి ఈ యాడ్ ప్రత్యేకంగా విడుదల కానుంది. దీపావళి స్పెషల్‌గా ఆహాలో ప్రసారంకాబోయే ఐదు షోల ప్రమోషన్లలో ఈ వీడియో ప్రత్యేకం కానుందని తెలుస్తోంది. ఈ ప్రోమో వీడియో త్వరలో ప్రసారం కానుంది అని తెలుస్తోంది.

Also read : Kajal Aggarwal honeymoon: కాజల్ అగర్వాల్ హనీమూన్ ప్లాన్స్

అలాగే సమంత కూడా ఆహాలో సామ్ జామ్ ( Sam Jam on Aha ) అనే సెలెబ్రిటీ టాక్ షో చేయబోతోంది. ప్రముఖ సెలెబ్రిటీలతో సమంత సామ్ జామ్ షో షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది అని తెలుస్తోంది. అల్లు అరవింద్ ఈ షోకి సంబందించిన అధికారిక ప్రకటనను శుక్రవారం ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. ఈ షో కూడా ఈ ఏడాది దీపావళి ( Diwali 2020 ) కానుకగా దీపావళి ముందు రోజు నవంబర్ 13న ప్రసారం కానుంది. 

Also read : Hyderabad Cinema city: కేసీఆర్‌ని కలిసిన చిరు, నాగ్.. 1500-2000 ఎకరాలతో సినిమా సిటీ

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ), కింగ్ నాగార్జున ( Nagarjuna ), విక్టరీ వెంకటేష్‌తో ( Venkatesh ) పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులను సమంత ఈ టాక్ షోలో ఇంటర్వ్యూ చేయనుంది. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 దసరా ఎపిసోడ్ ( Bigg Boss Telugu season 4) హోస్ట్ చేసిన జోష్‌లో ఉన్న సమంత.. త్వరలోనే అదే జోష్‌తో సామ్ జామ్ షో కూడా హోస్ట్ చేయనుందన్న మాట.

Also read : Bigg Boss Telugu 4: ఎలిమినేషన్ ప్రమాదంలో ఎవరున్నారు ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

https://apple.co/3loQYeApple Link - 

Trending News