Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas Radhe Shyam)​, పూజా హెగ్జె హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా రాధే శ్యామ్. భారీ బడ్జెట్​తో తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంది. తమిళ్​, కన్నడ, మలయాళం భాషల్లో డబ్బ్ అయ్యింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంక్రాతి సందర్భంగా (Radhe Shyam release date) జనవరి 14న విడుదల కానుంది. ఇటీవలే ప్రీ రిలీజ్​ ఈవెంట్ జరుపుకుంది ఈ సినిమా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమాలో ఫైట్లు ఉండవా?


ఇటీవేల విడుదలైన ట్రైలర్​లో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ముఖ్యంగా ప్రభాస్​ సినిమా అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. బాహుబలి (Baahubali Actor Prabhas)తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. అందుకే ప్రభాస్​ నుంచి సినిమా వస్తుందంటే.. భారీ బడ్జెట్​తో పాటు సినిమాలో యాక్షన్​ సీన్​లు ఉంటాయనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. అందుకు తగ్గట్లుగానే బాహుబలి తర్వాత సాహోలో భారీ యాక్షన్​ సీన్లు పెట్టారు.


అయితే రాధేశ్యామ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్​ లవర్​ బాయ్​గా, అమ్మాయిలను ఫ్లర్ట్​ చేసే క్యారెక్టర్​ పోషించినట్లు తెలుస్తోంది. ట్రైలర్​ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ట్రైలర్​లో ఒక్క ఫైట్ సీన్​ కూడా లేదు. అంటే ఈ సినిమా పూర్తిగా లవ్​ స్టోరీ, ఏమోషన్స్​తోనే నడుస్తుందని తెలుస్తోంది.


ప్రభాస్​ ఏమన్నారంటే..


ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ప్రభాస్​ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇదో భిన్నమైన కథ అని.. లవ్​స్టోరీ అయినప్పటికీ అంతకుమించి ఈ సినిమా ఉంటుందని చాలా ట్విస్ట్​లు ఉంటాయని చెప్పి అంచనాలు పెంచేశారు. క్లైమ్యాక్స్​ కొత్తగా ఉంటుందని తెలిపారు.


డైరెక్టర్​ క్లారిటీ..


ఈ సినిమాపై దర్శకుడు రాధాకృష్ణ కుమార్​ కూడా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు ప్రీ రిలీజ్ ఈవెంట్​లో చెప్పారు. ఈ సినిమాలో ఫైట్స్ ఉండవని పూర్తిగా లవ్​ స్టోరీ, జాతాకాల వంటి అంశాల చుట్టే కథ తిరుగుతుందని హింట్ ఇచ్చారు. ఈ కారణంగానే ఫైట్​ సీన్లు పెట్టలేదని తెలుస్తోంది.



ఫ్యాన్​ ఎలా తీసుకుంటారో..


ఇంతకు ముందు కూడా ప్రభాస్ లవర్​ బాయ్​గా కనిపించారు. డార్లింగ్​, మిర్చి లాంటి సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్​ చేశారు. అయితే ఆయా సినిమాల్లో యాక్షన్​ సీన్లు, ఫైట్లు కూడా ఉంటాయి. మొదటి సారి పూర్తి స్థాయి లవ్​స్టోరీ చేస్తున్నారు ప్రభాస్​. మరి ఈ సినిమాను ఫ్యాన్స్​​ ఎలా తీసుకుంటారో తెలియాలంటే.. జనవరి 14 వరకు ఆగాల్సిందే.


రాధేశ్యామ్ గురించి..


ఈ సినిమాలో కృష్ణం రాజు (తెలుగు వెర్షన్​), సత్య రాజ్​ (తెలుగు మినహా ఇతర భాషల్లో), భాగ్య శ్రీ, జగపతి బాబు, ప్రియదర్శి, మురళీ శర్మ సహా భారీ తారాగణం నటించారు.


ఈ సినిమాకు భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్​, ప్రసిద్ధ నిర్మాతలుగా వ్యవహరించారు. తెలుగు సహా దక్షిణాది భాషలకు జస్టిన్​ ప్రభాకరన్​ సంగీతమందించారు. హిందీ పాటలకు మిథున్​, అమాల్​ మాలిక్​ మ్యూజిక్​ డైరెక్టర్లు. సినిమా బడ్జెట్ అంచనా రూ.350 కోట్లు.


Also read: Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ హోస్ట్‌గా బాలయ్య..?? గెట్ రెడీ ఫర్ అన్‌స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్..?


Also read: 83 Movie Review: 1983 ఇండియన్ టీమ్ కు సరైన ట్రిబ్యూట్ '83' మూవీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook