RadheShyam Sanchari Song: టాలీవుడ్​లో కొత్త సినిమాల అప్​డేట్స్ జోరందుకున్నాయి. తాజాగా ప్రభాస్​ ఫ్యాన్స్​లో జోష్​ నింపే.. కొత్త అప్​డేట్​ ఇచ్చింది 'రాధే శ్యామ్​' చిత్ర యూనిట్​. ఈ సినిమాలో మరో ఫుల్​ సాంగ్​ 'సంచారి'ని నేడు (గురువారం) విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కొత్త నేలపై.. గాలి సంతకం' అంటూ సాగే ఈ పాట సినిమాలో ప్రభాస్​ క్యారెక్టర్​ను రిప్రజెంట్ చేసేలా ఉంది. లవర్​బాయ్​గా.. లైఫ్ ఎంజాయ్​ చేసే క్యారెక్టర్​లో ప్రభాస్​ కనిపించారు. పాటలో లోకేషన్స్​ ఆకట్టుకునెలా ఉన్నాయి. కొన్ని సీన్లలో ప్రభాస్​ స్టంట్లు అదుర్స్ అనిపించాయి.



రాధేశ్యామ్ గురించి..


ఈ సినిమాలో ప్రభాస్​కు జోడీగా పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్​, సాంగ్​లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఫిదా చేసేటట్లు ఉంది. ముఖ్యంగా ఎక్కువగా మాస్​ లుక్​లో కనిపించే ప్రభాస్ ఈ సినిమాలో లవర్​బాయ్​గా చాలా కొత్తగా కనిపిస్తున్నారు.


ఈ సినిమాకు రాధా కృష్ణ కుమార్​ దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఏక కాలంలో చిత్రీకరించారు. తమిళం, కన్నడ, మళయాలంలోనూ డబ్ అయ్యింది. అన్ని భాషల్లో వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.


తెలుగు పాటలకు జస్టిన్ ప్రభాకరన్​​ సంగీతం అందించగా.. హీందీ వెర్షన్​కు మిథూన్​, అమాల్​ మాలిక్​, మనన్ భరద్వాజ్​ సంగీతం అందించారు.


సాహో తర్వాత ప్రభాస్​ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 


Also read: Jr NTR Dubbing: ఆర్ఆర్ఆర్ కోసం తొలిసారిగా హిందీలో డబ్బింగ్ చెబుతున్న జూనియర్ ఎన్టీఆర్


Also read: Pushpa Song Dispute: మగోళ్లకు కోపమొచ్చింది, ఆ పాటపై హైకోర్టును ఆశ్రయించిన పురుష సంఘం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook