మరో పెళ్లి చేసుకున్న రాఘవేంద్ర రావు మాజీ కోడలు Kanika Dhillon
కనిక ధిల్లాన్... పేరు గుర్తుండే ఉంటుంది. తెలుగులో సైజ్ జీరో.. హిందీలో కేదార్ నాథ్, గిల్టీ లాంటి చిత్రాలకు కథ రాసిన సినీ రచయిత్రి అని చెబితే అందరూ గుర్తుపడతారో లేదో కానీ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి మాజీ భార్య కనిక ధిల్లాన్ అంటే అందరూ గుర్తుపడతారు కదా..
కనిక ధిల్లాన్... పేరు గుర్తుండే ఉంటుంది. తెలుగులో సైజ్ జీరో.. హిందీలో కేదార్ నాథ్, గిల్టీ లాంటి చిత్రాలకు కథ రాసిన సినీ రచయిత్రి అని చెబితే అందరూ గుర్తుపడతారో లేదో కానీ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి మాజీ భార్య కనిక ధిల్లాన్ అంటే అందరూ గుర్తుపడతారు కదా.. అవును.. ప్రకాశ్ కోవెలమూడికి విడాకులు ఇచ్చిన కనిక ధిల్లాన్ తాజాగా బాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్ హిమాన్షు శర్మను పెళ్లి చేసుకుంది.
ప్రకాశ్ కోవెలమూడికి డైవర్స్ ఇచ్చిన తర్వాత గత ఏడాది జూన్ నెలలోనే హిమాన్షు శర్మతో డేటింగ్‌లో ఉన్నట్టు వెల్లడించిన కనిక ధిల్లాన్.. గతేడాది డిసెంబర్‌లోనే అతడితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. కనిక ధిల్లాన్ భర్త హిమాన్షు శర్మ ఎవరు అనే విషయానికి వస్తే.. హిందీలో రాంఝనా, తను వెడ్స్ మను సిరీస్ వంటి చిత్రాలతో పాటు షారుఖ్ ఖాన్ ( Shah Rukh Khan ), అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన జీరో చిత్రాలకు కథ అందించిన రచయిత హిమాన్షు శర్మనే.
Also read : Nayanthara wedding: నయనతార పెళ్లికి తేదీ ఫిక్స్ !
ప్రస్తుతం అక్షయ్ కుమార్ ( Akshay Kumar ), ధనుష్ హీరోలుగా తెరకెక్కుతున్న అత్రంగి రే, అక్షయ్ కుమార్ హీరోగా రానున్న రక్షా బంధన్ చిత్రాలకు హిమాన్షు శర్మ కథ అందిస్తున్నాడు. రాంఝనా, తను వెడ్స్ మను సిరీస్ చిత్రాలను కో-ప్రొడ్యూస్ చేసి నిర్మాతగా మారిన హిమాన్షు శర్మ తాను డైలాగ్స్ రాసిన సినిమాలకు, కథ రాసిన చిత్రాలకుగాను బెస్ట్ డైలాగ్ రైటర్‌గా, బెస్ట్ స్టోరీ రైటర్‌గా పలు అవార్డ్స్ కూడా అందుకున్నాడు.
Also read : Samantha's remuneration: సామ్ జామ్ షోకు సమంత పారితోషికం ఎంతో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook