Rahul Ramakrishna  Vulgar Tweet: తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి చాలా త్వరగా సినిమాల్లో క్లిక్ అయిన అతి కొద్ది మంది నటులలో రాహుల్ రామకృష్ణ ఒకరు.. తరుణ్ భాస్కర్ చేసిన సైన్మా  అనే చిన్న షార్ట్ ఫిలిం ద్వారా నటనా రంగానికి పరిచయమైన ఆయన తర్వాత జయమ్ము నిశ్చయమ్మురా అనే సినిమాతో సినీ రంగానికి పరిచయం అయ్యారు. అయితే సందీప్ రెడ్డి వంగా తర్కెక్కించిన అర్జున్ రెడ్డి అనే సినిమాతో రాహుల్ రామకృష్ణకు మంచి బ్రేక్ లభించింది.. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్న రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. కేవలం తన సినిమా అప్డేట్స్ ఇవ్వడమే కాక ఎప్పటికప్పుడు తన భావాలను కూడా పంచుకుంటూ ఉంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా సినిమా వాళ్లు సోషల్ మీడియాలో రాజకీయ లేదా ఇతర వివాదాస్పద అంశాల జోలికి వెళ్లరు. కానీ రాహుల్ రామకృష్ణ మాత్రం ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చర్చనీయాంశంగా మారుతూ ఉంటారు. ఆ మధ్య నెట్ అనే ఒక వెబ్ మూవీ చేసి రిలీజ్ చేస్తున్న సమయంలో బూతు మాటలతో సినిమాని ప్రమోట్ చేసుకుని వార్తల్లో ఎక్కాడు. ఇక తాజాగా సమయం సందర్భం లేకుండా మీకు జీ*లో దమ్ముంటే సినిమా తీయండి ఇడియట్స్ అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేసి కాసేపటికి దాని డిలీట్ చేశాడు. 


తర్వాత ఆ ట్వీట్ చేసింది నేను కాదని అది నా ఆల్టర్ ఇగో అని మరో ట్వీట్ చేశారు. రాహుల్ రామకృష్ణ నోటి దురద మీద ఇప్పుడు పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తున్నాయి. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నోటికి వచ్చింది వాగడం మళ్ళీ ఈ ఎదవ కవర్ డ్రైవులు ఇవ్వడంలో తక్కువ ఏమీ లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే అసలు రాహుల్ రామకృష్ణ దేని గురించి ఈ కామెంట్ చేశాడనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయన నటించిన చిత్రాలు ఈ వారం పదిరోజుల్లో థియేటర్లలో విడుదలైన దాఖలాలు లేవు. చివరిగా ఆయన నటించిన విరాటపర్వం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మరి రాహుల్ రామకృష్ణ ఎవరి గురించి ఆ కామెంట్ చేశాడు అనేది ఆయన స్పందిస్తే కానీ తెలియదు.


Also Read: Pavitra Lokesh: నరేష్ తో బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాలా?.. ప్లీజ్ సపోర్ట్ చేయండి!


Also Read: Rashi Khanna Pics: హద్దులు దాటేసిన రాశీ ఖన్నా.. దాచడానికి ఇంకేముంది?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook