Raj Tharun Purushothamudu Trailer: రాజ్ తరుణ్ హీరోగా చేసిన తిరగబడరా స్వామి త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ హీరో  నటిస్తున్న మరో కొత్త సినిమా పురుషోత్తముడు కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాని.. శ్రీ శ్రీదేవి నిర్మాణ సంస్థ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆకతాయి, హమ్ తుమ్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు.. రామ్ భీమన పురుషోత్తముడు సినిమాను రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో రాజ్ తరుణ్ తో పాటు బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ,  ముకేష్ ఖన్నా వంటి స్టార్ నటులు కూడా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తం విడుదలకు సిద్ధమవుతున్న కారణంగా…ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ ను సినిమా యూనిట్ రిలీజ్ చేశారు. 


 



ఈ సందర్భంగా దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ - ‘ఈ రోజు ఫిలింనగర్ దైవసన్నిధానం, మోతీనగర్ రామాయలయంలో పూజా కార్యక్రమాలు జరుపుకుని మా చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది.  ఈ ట్రైలర్ కు అతి తక్కువ సమయంలో లో మంచి రెస్పాన్స్ వస్తోంది. మా సినిమాలో ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం వంటి ఎంతోమంది స్టార్ నటులు ఉన్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, యాక్షన్, మంచి మ్యూజిక్ వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులందరికీ నచ్చేలా మేము ఈ సినిమాని మీ ముందుకు 26న తీసుకోరాబోతున్నాము’ అని తెలియజేశారు. 


ఈ సినిమా నిర్మాతలు ప్రకాష్ తేజావత్, రమేష్ తేజావత్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ట్రైలర్ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈరోజు ట్రైలర్స్ కి వచ్చిన రెస్పాన్స్ థియేటర్స్ లోనూ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నాం. సకుటుంబంగా మా సినిమాకు రండి. తప్పకుండా మీరంతా మా సినిమాని ఎంజాయ్ చేస్తారు” అని చెప్పుకొచ్చారు.


కాగా ఈ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే.. ఈసారి రాజ్ తరుణ్ గట్టిగా ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది. ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో.. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించేలా కనిపిస్తోంది.


Also read: YS Jagan: వినుకొండలో రషీద్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook