Saranga Dariya title poster: తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజరవింద్ర ఇప్పుడు మన ముందుకి ఒక మంచి ఫ్యామిలీ సినిమాతో రానున్నారు. రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయి జ క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశిశ్యులతో ఉమాదేవి శరత్ చంద్ర నిర్మాతలూ గా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం" సారంగదరియా". 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈరోజు ఈ చిత్ర టైటిల్ పోస్టర్ని యంగ్ హీరో రాజ్ తరుణ్ చేతులమీదుగా విడుదల అయ్యింది ఈ సందర్బంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ..’సారంగదరియా ఫస్ట్ లుక్ పోస్టర్ నేను విడుదల చెయ్యడం చాలా సంతోషంగా ఉంది పోస్టర్ అండ్ టైటిల్ చూడగానే పాజిటివ్ గా చాలా బాగుంది అనిపించింది ఫ్యామిలీ చిత్రం గా త్వరలో విడుదల కానున్న ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్న మా రాజా రవీంద్ర అన్నకి ప్రొడ్యూసర్స్ శరత్ చంద్ర గారికి ఉమాదేవి గారికి మరియు ఈ చిత్రం తో డైరెక్టర్ గా పరిచయం అవుతున్న పద్మారావు అలియాస్ పండు కి "సారంగదరియా" సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని తెలియజేశారు.


డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు )మాట్లాడుతూ.. 
‘అందరికీ నమస్కారం నేను "సారంగదరియా" మూవీ తో దర్శకుడిగా పరిచయమవుతున్నను ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ కి ధన్యవాదాలు. ఈ రోజు మా మూవీ పోస్టర్ విడుదల చేసిన హీరో రాజ్ తరుణ్ గారికి థాంక్యూ . ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన రాజా రవీంద్ర గారికి మా ప్రొడ్యూసర్స్ శరత్ చంద్ర గారికి ఉమాదేవి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ సినిమా ఒక మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణల తో కథ ఉంటుంది. మా చిత్రాన్ని త్వరలో విడుదల చెయ్యాలి అనుకుంటున్నాము త్వరలోనే మిగతా విషయాలు తెలియజేస్తాము’ ఆని అన్నారు.


ఇక ఆ తరువాత ప్రొడ్యూసర్ శరత్ చంద్ర మాట్లాడుతూ…’మా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ అడిగిన వెంటనే విడుదల చేసిన హీరో రాజ్ తరుణ్ గారికి చాలా థాంక్స్ త్వరలో మూవీ విడుదలకి సన్నాహాలు చేస్తున్నాము మా "సారంగదరియా" అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.


ఇక ఈ సినిమాకి M. ఎబెనెజర్ పాల్ సంగీతం అందిస్తుండగా..సిద్ధార్థ స్వయంభు  సినిమాటోగ్రఫీ వహించారు.


Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే


Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి