Rajamouli About Great Idea of RRR Sequel రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇంటర్నేషనల్ వైడ్‌గా అదరగొట్టేసింది. హాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించింది. హాలీవుడ్ డైరెక్టర్లు, క్రిటిక్స్ ఇలా అందరూ కూడా రాజమౌళిని పొగిడేశారు. ఇక ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు రేసులో కూడా నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం కూడా అందుకోబోతోన్నట్టు కనిపిస్తోంది. రెండు కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ నామినేట్ అయిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే జాతీయ మీడియా తాజాగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సౌత్ ఫిల్మ్ అడ్డా అంటూ దక్షిణాది స్టార్ డైరెక్టర్లతో ఓ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఇందులో రాజమౌళి, లోకేష్‌ కనకరాజ్, పృథ్వీరాజ్ సుకుమారన్, కమల్ హాసన్ వంటి వారితో చర్చలు పెట్టించారు. దీంట్లో లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ తన సినిమాల గురించి చెప్పాడు. రానున్న పదేళ్లకు సరిపడా సినిమాలున్నాయని, తన సినిమాటిక్ యూనివర్సిటీలో ఏ పాత్రకైనా సరే ప్రీక్వెల్ గానీ సీక్వెల్ గానీ చేసుకోవచ్చని, రోలెక్స్ మళ్లీ తిరిగి వస్తాడంటూ ఇలా చెప్పుకుంటూ పోయాడు.


 



ఇక ఇదే సమయంలో రాజమౌళి సైతం తన ఆర్ఆర్ఆర్ మూవీ సీక్వెల్ గురించి స్పందించాల్సి వచ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి మొదట్లో ఆలోచించలేదని, అంతగా ఐడియాలు కూడా రాలేదని అన్నాడు. కానీ ఇప్పుడు సీక్వెల్ మీద ఓ గొప్ప ఆలోచన వచ్చిందని, ప్రస్తుతం అయితే రైటింగ్ స్టేజ్‌లోనే ఉందని, ఇప్పుడే ఏమీ చెప్పలేనని దర్శకధీరుడు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతానికి అయితే రాజమౌళి మాత్రం మహేష్‌ బాబుతో చేయబోయే సినిమా మీదే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.


ఆర్ఆర్ఆర్ సినిమాను మాత్రం రాజమౌళి ఇంకా గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు. గత నెలలో ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్‌లో రిలీజ్ చేయించాడు. దానికి బాగానే ప్రమోట్ చేశాడు. చివరకు అక్కడ రికార్డ్ కలెక్షన్లను కొట్టేశాడు. అప్పుడెప్పుడో రజినీ కాంత్ ముత్తు సినిమా మీదున్న రికార్డులను ఆర్ఆర్ఆర్ చెరిపేసింది.


Also Read : HBD Venkatesh : వాటిలో వెంకీ మామ స్పెషలిస్ట్.. కెరీర్ మొత్తంలో ఎన్ని రీమేక్‌లు చేశాడంటే?


Also Read : VK Naresh Defamation Case : యూట్యూబ్‌ ఛానళ్లపై కేస్.. ట్రోల్స్ మీద పవిత్ర-నరేశ్‌ యుద్దం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook