NTR 30 Begins : మెరిసిన జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్, రాజమౌళి.. కథ ఏంటో చెప్పిన కొరటాల
NTR 30 Pooja Ceremony ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రావాల్సిన సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వచ్చింది. అయితే చివరకు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ ఈవెంట్‌కు ప్రశాంత్ నీల్, రాజమౌళి వంటి వారు గెస్టులుగా వచ్చారు.
NTR 30 Pooja Ceremony యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా నేడు (మార్చి 23)ఘనంగా ప్రారంభించింది చిత్రయూనిట్. నేడు జరిగిన పూజా కార్యక్రమంలో పాన్ ఇండియన్ డైరెక్టర్లు రాజమౌళి, ప్రశాంత్ నీల్‌లు సందడి చేశారు. ఇక నేటి ముహూర్తపు షాట్‌కు ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ల మీద రాజమౌళి క్లాప్ కొట్టగా, ప్రశాంత్ నీల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ ఈవెంట్‌లో జాన్వీ కపూర్ చీరకట్టులో మెరిసింది.
ఈ ఈవెంట్‌లో కొరటాల శివ మాట్లాడుతూ.. 'జనతా గ్యారెజ్ తరువాత ఎన్టీఆర్‌తో రెండో సారి పని చేస్తున్నాను.. మళ్లీ ఆయనతో పని చేసే అవకాశం దొరకడం నాకు అదృష్టం. ఈ తరంలోని హీరోల్లో గొప్ప నటుడైనా నా తమ్ముడితో పని చేయడం నాకు సంతోషంగా ఉంది. కోస్టల్ ఏరియాలోని ల్యాండ్‌ల మీద ఈ కథ ఉంటుంది.. ఈ కథలో మనుషులకంటే ఎక్కువగా మృగాలుంటాయి.. దేవుడంటే భయం లేదు.. చావంటే భయం లేదు.. ఒకటే ఒకటి అంటే భయం.. అదే ఈ సినిమా నేపథ్యం..
భయం ఉండాలి.. భయం అవసరం.. భయపెట్టడానికి ప్రధాన పాత్ర ఏ రేంజ్‌కు వెళ్తుందనే ఎమోషనల్ డ్రైవ్..ఇది చాలా పెద్దగా ఉంటుంది.. నా బెస్ట్ అవుతుందని అందరికీ ప్రామిస్ చేస్తున్నాను.. ఇంత పెద్ద ఐడియాను తీసుకెళ్లేందుకు నాకు పెద్ద ఆర్మీ కావాలి.. నా తమ్ముడు అనిరుధ్.. ఈ సినిమాకు ప్రాణం పోస్తాడు.. కథ చెప్పాక ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు.. ఫైర్‌తో రాశారు ఈ కథను అని అన్నాడు.. శ్రీకర్ ప్రసాద్ గారు స్క్రిప్ట్‌తో సహా ట్రావెల్ చేశారు.. ర్యాండీ సర్ నాతో ఏడాది నుంచి ట్రావెల్ అవుతూనే ఉన్నారు. సబు సార్ ఆయన తప్పా ఇంకెవ్వరూ కూడా చేయలేరు.. నా ఊహకు ఆయనే రూపం ఇవ్వగలరు.. నా ఫ్రెండ్ యుగంధర్ వీఎఫ్‌ఎక్స్ అద్భుతంగా ఉండబోతోంది' అని అన్నారు.
కొరటాల శివను గత ఏడాది కలిశాను.. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా బ్రదర్ తారక్, కొరటాల శివ సర్‌కు థాంక్స్.. నేను తిరిగి వస్తున్నా.. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ అని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అన్నాడు.
Also Read: Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?
Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook