SVP Pre Release Event: సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ వేడుక..అతిధులెవంటే..?
SVP Pre Release Event: సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ వేడుక ఇవాళ జరగనుంది. ఈ వేడుకకు అతిధులుగా ఎవరు హాజరుకానున్నారో తెలుసా
Sarkaru Vaari Paata Pre Release Event: సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ వేడుక ఇవాళ జరగనుంది. ఈ వేడుకకు అతిధులుగా ఎవరు హాజరుకానున్నారో తెలుసా
టాలీవుడ్‌లో వరుసగా అగ్రనటులు సినిమాలు ఒకదాని తరువాత మరొకటిగా విడుదలవుతున్నాయి. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మే 13న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది.
ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సినిమా ట్రైలల్ దూసుకుపోతుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. కామెడీ, యాక్షన్ రెండూ కన్పిస్తుండటంతో సినిమా సూపర్ హిట్ అవుతుందనే అంచనాకు వచ్చేశారంతా. ఇప్పటికే కళావతి పాట హిట్టైంది. సినిమా ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, యాక్షన్ మూవీగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా..వెన్నెల కిషోర్, సముధ్రఖని ముఖ్యపాత్రలో కన్పించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రాన్ని పరశురామ్ తెరకెక్కించారు. తమన్ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలవనుంది.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు రాజమౌళి, త్రివిక్రమ్ అతిధిలుగా హాజరుకానున్నారు. రాజమౌళి, త్రివిక్రమ్ హాజరుకానున్నారనే వార్త సినిమాకు మరింత హైప్ పెంచేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook