Nayanatara Vignesh Shivan: ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న నయనతార, విగ్నేశ్ శివన్... పెళ్లి డేట్ ఫిక్స్...

Nayanatara Vignesh Shivan Marriage: నయనతార-విగ్నేశ్ శివన్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా శ్రీవారిని దర్శించుకున్న ఈ జంట త్వరలో తిరుమలలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2022, 11:37 AM IST
  • నయన్, విఘ్నేశ్ శివన్ పెళ్లి డేట్ ఫిక్స్
  • తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయన్ జంట
  • తిరుమల వేదికగానే పెళ్లి జరగనున్నట్లు ప్రచారం
Nayanatara Vignesh Shivan: ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న నయనతార, విగ్నేశ్ శివన్... పెళ్లి డేట్ ఫిక్స్...

Nayanatara Vignesh Shivan Marriage: లేడీ సూపర్‌ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అదిగో.. ఇదిగో... అంటూ ఈ జంట పెళ్లిపై చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎట్టకేలకు ఈ జంట ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈ జంట... త్వరలో శ్రీవారి సన్నిధిలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వచ్చే నెల 9న నయన్-విఘ్నేశ్ జంట తిరుమలలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి ముందు శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు పెళ్లి వేదిక బుక్ చేసుకోవడానికి తిరుమలకు వచ్చినట్లు సమాచారం. ఇవాళ (మే 7) వీఐపీ బ్రేక్ దర్శనంలో ఈ జంట శ్రీవారిని దర్శించుకుంది. ఇటీవల నయనతార నటించిన 'కాతువాకులా రెండు కాదల్' సినిమా హిట్ అయినందునే నయన్, విగ్నేశ్ శ్రీవారిని దర్శించుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

కొద్దిరోజుల క్రితమే నయనతార, విఘ్నేశ్ శివన్‌లు సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకుంటారని అంతా భావించినప్పటికీ దైవ సన్నిధిలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  కరోనా కారణంగా ఈ జంట పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు మూడు ముళ్లతో ఈ జంట ఒక్కటి కానున్నారు.

'నాను రౌడీదాన్' చిత్ర షూటింగ్ సమయంలో విఘ్నేశ్, నయన్ మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ జంట సీక్రెట్ కూడా పెళ్లి కూడా చేసేసుకున్నారని ప్రచారం కూడా జరిగింది. విఘ్నేశ్ శివన్‌ కన్నా ముందు నయనతార శింబు, ప్రభు దేవాలతో గాఢమైన ప్రేమాయణం నడిపింది. ప్రభు దేవాను పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ కుదరలేదు. ఆ తర్వాత విఘ్నేశ్‌తో ప్రేమలో పడిన నయన్... ఎట్టకేలకు అతడికి భార్య కాబోతోంది. 

 

Also Read: Kiara Advani Oops Moment: రామ్ చరణ్ హీరోయిన్ కు చేదుఅనుభవం.. గాలికి పైకి లేచిన గౌను.. వీడియో వైరల్!

Also Read: rahulgandhi permits visit chanchalguda: చంచల్‌గూడ జైలులో ములాఖత్‌కు రాహుల్‌కు అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News