Rajamouli: బాహుబలిలో అలాంటి తమన్నా సీన్స్ అందుకే పెట్టాము.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rajamouli Documentary: తెలుగు డైరెక్టర్స్ లో.. రాజమౌళి స్థానం ప్రత్యేకం. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు.. ఈ దర్శకుడు. హాలీవుడ్లో సైతం రాజమౌళి తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఈ మధ్య ఈ దర్శకుడు గురించి నెట్ ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీ తీసింది. ఈ డాక్యుమెంటరీ లో… కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు రాజమౌళి.
Baahubali Controversy: ఎంతోమంది తెలుగు సినిమా స్టైల్ ని.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారిలో దర్శకుడు రాజమౌళికి.. ప్రత్యేక స్థానం ఉంది. బాహుబలి సినిమాతో.. తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో.. మన తెలుగు చిత్రాలను ఆస్కార్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇలాంటి గొప్ప దర్శకుడి గురించి ప్రేక్షకులకు తెలియజేయడానికి.. నెట్ ఫ్లిక్స్ ఈమధ్య రాజమౌళి పై డాక్యుమెంటరీ చేసింది.
ఈ డాక్యుమెంటరీలో భాగంగా రాజమౌళి గురించి అలానే ఆయన సినిమాల.. గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ప్రేక్షకులకు తెలిసాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్న రాజమౌళికి.. కొన్నిసార్లు విమర్శలు తప్పలేదు. ముఖ్యంగా తన కెరియర్ లో.. బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాహుబలి సినిమా కూడా ఆయనకి ఎన్నో విమర్శలను తెచ్చి పెట్టింది. ప్రత్యేకించి అందులో కొన్ని తమన్నా సన్నివేశాలను లేవనెత్తి మరీ వివాదం సృష్టించారు కొంతమంది. అయితే ఈ విషయంపై.. అప్పట్లో రాజమౌళి ఎప్పుడు స్పందించలేదు. కానీ ఇప్పుడు ఈ విషయం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
బాహుబలి -1 చిత్రంలో తమన్నా కోసం ప్రభాస్.. భారీ జలపాతం మీదుగా మరో రాజ్యానికి వెళ్తాడు. ఇక అక్కడ తమన్నాను చూసిన ప్రభాస్ కి షాక్ ఎదురవుతుంది. ఎందుకంటే ఆమె ప్రభాస్..ఊహించినట్టు ఉండదు. తమన్నా అక్కడ.. స్త్రీ తత్వాన్ని మరిచిపోయి.. ప్రభాస్ కి యోధురాలిగా కనిపిస్తుంది. అయితే ప్రభాస్.. పచ్చబొట్టేసిన అనే.. పాటలో తమన్నా అమ్మాయి అని గుర్తు చేస్తాడు. కాగా ఆ సన్నివేశాలలో.. తమన్నా అనుమతి లేకుండానే ప్రభాస్ ఆమెను తాకుతాడు. ఇక దీనిపై అప్పట్లో ఎన్నో విమర్శలు వచ్చాయి. తమన్నా అనుమతి లేకుండానే ప్రభాస్ పాత్ర..ఆమెను బలవంతం చేసినట్లు చూపించారు అని కామెంట్లు వచ్చాయి.
ఈ విషయంపై ప్రభాస్ స్పందించారు. తమన్నాకు.. యుద్ధంలాంటివి ఇష్టం లేదని ప్రభాస్ పాత్ర తెలుసుకుంటాడు .ఎందుకంటే పాట కంటే ముందు ఒకసారి.. తమన్నా చిరాకుతో నదిలో ఆమె ముఖం వైపు చూస్తూ ఉండడం ప్రభాస్ వెనకనుంచి గమనిస్తాడు. అలాగే మొదటిసారి ప్రభాస్ , తమన్నా ఎదురెదురుగా వచ్చినప్పుడు తమన్నా.. తన కత్తిని ప్రబాస్ పై ఉంచుతుంది. ఇక అప్పుడు ప్రభాస్ ఆ విషయం గురించి స్పందించిన తీరు చూసి స్పష్టం అవుతుంది. అంతకుమించి ఆ సిన్ విమర్శించే వారికి చెప్పడానికి ఇంకా ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.
Read more:Snake vs Lizard: మానిటర్ బల్లిని కసితీరా కాటు వేసిన నల్ల పాము.. షాకింగ్ వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter