RRR Movie Dialogue: యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వస్తాయా..రాజమౌళి ఉద్దేశ్యమేంటి
RRR Movie Dialogue: బాహుబలి తరువాత అంతగా అంచనాలు పెంచుతున్న సినిమా రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ. రాజమౌళి స్వయంగా లీక్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
RRR Movie Dialogue: బాహుబలి తరువాత అంతగా అంచనాలు పెంచుతున్న సినిమా రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ. రాజమౌళి స్వయంగా లీక్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"యుద్దాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి..అది ధర్మయుద్ధమైతే విజయం తధ్యం " ఇదీ ఆ డైలాగ్. బాగుంది కదా. యుద్ధం కోసం వెళ్లేటప్పుడు ఆయుధాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరోక్షంగా చెప్పడమే ఇది. ఈ డైలాగ్ ఆర్ఆర్ఆర్ సినిమాలోనిది. ఆర్ఆర్ఆర్ (RRR Movie)రూపశిల్పి రాజమౌళి స్వయంగా బయటపెట్టిన డైలాగ్ ఇది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా సినిమాలకు సంబంధించి ఏ విశేషాలు బయటపెట్టకుండా, బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు దర్శకుడు రాజమౌళి. చిత్రబృందంలో సభ్యులు కూడా ప్రొమోషన్ సందర్భంగా సినిమా సీక్రెట్స్ ఏవీ బయటపడకుండా జాగ్రత్త పడతాడు రాజమౌళి(Rajamouli).ఇటీవల బాహుబలి వేడుకలో ప్రభాస్ ఏదో చెప్పబోతుంటే రాజమౌళి వారించిన పరిస్థితి ఉంది. అటు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్ పాత్ర గురించి రాజమౌళి తండ్రి మీడియాతో చర్చించడంపై కూడా రాజమౌళి నొచ్చుకున్నట్టుగా సమాచారం. అంత జాగ్రత్తగా ఉండే రాజమౌళి స్వయంగా ఈ డైలాగ్ బయటపెట్టాడు. అందుకే ఇదిప్పుడు వైరల్ అవుతోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో(RRR Movie) ఓ కీలక సన్నివేశంలో వచ్చే డైలాగ్(RRR Movie Dialogue) ఇది. ఈ డైలాగ్‌ను బట్టి సినిమాలో ఓ భారీ యుద్ధముండవచ్చని..హీరోలిద్దరూ ధర్మయుద్ధం చేయడం ద్వారా విజయం సాధిస్తారని అర్ధం చేసుకోవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఛాయిస్ ఫౌండేషన్ స్వచ్ఛంధ సంస్థకు సంబంధించిన ఓ కార్యక్రమంలో రాజమౌళి ఈ డైలాగ్ బయటపెట్టారు. ప్రముఖ క్రికెటర్ కపిల్‌దేవ్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించారు.
Also read: Honour to Samantha: పెరుగుతున్న సమంత క్రేజ్, స్పీకర్‌గా సమంతకు ఆహ్వానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook