Rajamouli Praises Sumanth Prabhas ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్లుగా నిలుస్తున్న సినిమాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మేమ్ ఫేమస్ అనే సినిమా కూడా చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించారు. పైగా అందరూ కొత్తవారే కనిపించారు. మేజర్, రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలను నిర్మించిన చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించడం.. అడవి శేషు, మహేష్ బాబు వంటి వారు సినిమాని ప్రమోట్ చేయడంతో పాటుగా టీజర్ ట్రైలర్లు కూడా యూత్లో సినిమా మీద ఆసక్తిని క్రియేట్ చేశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సారియా హీరోయిన్ గా నటించింది. సిరి రాశి వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించారు . ఇప్పటికే ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతూ ముందుకు దూసుకు వెళ్తూ ఉండగా ఆసక్తికరంగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించారు.


చాలా కాలం తర్వాత థియేటర్లో ఒక సినిమాని ఆద్యంతం ఎంజాయ్ చేశాను. ఈ సినిమాని సుమంత్ కోసం చూడండి.  ఇతనికి డైరెక్టర్గా యాక్టర్ గా మంచి భవిష్యత్తు ఉంది. అన్ని క్యారెక్టర్లు చాలా బాగా రాసుకున్నాడు. అందరు యాక్టర్లు చాలా న్యాచురల్ గా నటించారు. ముఖ్యంగా అంజి మామ పాత్ర బాగుంది. అందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది అంటూ ఆయన రాసుకొచ్చారు.


Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!


నిజానికి రాజమౌళి ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్ ఉన్న యంగ్ టాలెంట్ ఉన్న దాన్ని ఏమాత్రం వెనకాడకుండా ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఇలా మేం ఫేమస్ టీం కి సపోర్ట్ చేస్తూ ట్రీట్ చేయడం హార్ట్ టాపిక్ అవుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరోగా నటించిన డైరెక్ట్ చేసిన సుమంత్ ప్రభాస్ అభిమాని అతని అసలు పేరు సుమంత్ రెడ్డి కాగా ప్రభాస్ మీద అభిమానంతో ఫేస్బుక్ అకౌంట్ పేరు సుమంత్ ప్రభాస్ అని పెట్టుకున్నాడట ఫైనల్ గా అదే ఫిక్స్ అయిపోయింది పాతికేళ్లు కూడా దాటని ఈ కుర్రాడు ఒక సినిమాలో హీరోగా నటించడమే కాదు డైరెక్ట్ కూడా చేయడం అది రాజమౌళి లాంటి వాళ్ళ కంటపడి ఆయన దాన్ని ప్రమోట్ చేయడం మామూలు విషయమా?


Also Read: Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK