GOAT: : విజయ్ మొదటి ఆప్షన్ కాదా.. ఆ ఇద్దరు సూపర్ స్టార్స్ ని తండ్రికొడుకులుగా అనుకున్న దర్శకుడు..!
GOAT Update: విజయ్ హీరోగా స్వస్తిపలికి రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో చివరి సినిమాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ సినిమా చేయనున్నారు. అయితే ఈ సినిమాకి విజయ్ మొదటి ఎంపిక కాదని, రజినీకాంత్ ,ధనుష్ లతో సినిమా చేయాలనుకున్నారు. కానీ టెక్నాలజీని ఉపయోగించి విజయ్ ద్విపాత్రాభినయం చేసినట్లు సమాచారం.
Thalapathy Vijay GOAT: కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన ఇటీవలే రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. వచ్చే 2026 ఎన్నికలలో పోటీ చేయబోతున్నానని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే కోలీవుడ్లో చివరి సినిమాగా.. గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇకపోతే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ చేపట్టింది. అందులో భాగంగానే ఈ సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమా మొదటి ఎంపిక విజయ్ కాదు అంటూ సంచలన కామెంట్లు చేశారు. వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. ముందుగా ఈ సినిమా కథ రాసుకునేటప్పుడు తండ్రిగా రజనీకాంత్ , కొడుకుగా ధనుష్ పాత్రలను అనుకొని కథ రాశాను అని తెలిపారు.
“కానీ డీ ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించి.. ఒకే నటుడితో రెండు పాత్రలు చేయించాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే విజయ్ ని ఎంపిక చేసి తండ్రిగా, కొడుకుగా డి ఎజింగ్ టెక్నాలజీ యాప్ ను ఉపయోగించి ద్విపాత్రాభినయం చేసేలా చేశాను” అంటూ తెలిపారు వెంకట్ ప్రభు.
ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యాక్షన్ అండ్ స్టంట్స్ తో ట్రైలర్ మొత్తం నింపేశారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా ఒక పాత్రలో తండ్రి గాంధీగా, ఇంకొక పాత్రలో కొడుకు జీవన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని , అసలు ఈ చిత్రంలోని మలుపులకు ప్రేక్షకులు తమ సీట్లలో కూర్చోకుండా ఉత్కంఠ గా నెక్స్ట్ సీన్ కోసం ఎదురు చూస్తారు అంటూ డైరెక్టర్ తెలిపారు. ఇకపోతే భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని డైరెక్టర్ తెలిపారు. ఇకపోతే విడుదల కోసం అభిమానులు ఎదురుచూడమే కాదు ఇందులలో నటీనటుల ఎంపిక నిర్ణయాలు, డీ ఎజింగ్ టెక్నాలజీ ఉపయోగించారని తెలిసి సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
Also Read: Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్
Also Read: Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter