Rajinikanth Called Gopichand Malineni: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలయి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఆయన సరసన హనీ రోజ్, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టి మరి సూపర్ హిట్ గా నిలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందు బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనే సందిగ్దత నెలకొన్నా సరే ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసి సినిమాని సూపర్ హిట్ గా నిలిపారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఇది తన జీవితంలోనే మరిచిపోలేని సంఘటన అంటూ ఆయన ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని నిన్న ఆయన వీర సింహారెడ్డి సినిమా చూసి సినిమాని బాగా ప్రేమించారని చెప్పుకొచ్చారు తలైవా నుంచి ఫోన్ రావడంతో ఉబ్బి తబ్బీబు అయిపోతున్నాను అంటూ గోపీచంద్ మలినేని ట్వీట్ చేశారు.


సినిమా గురించి పొగుడుతూ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు సినిమా చూస్తున్నప్పుడు ఆయన ఫీలైన ఎమోషన్, సినిమా గురించి ఆయన మాట్లాడిన మాటలు ప్రపంచంలో నాకు అన్నిటికంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి థాంక్యూ రజినీకాంత్ సర్ అంటూ గోపీచంద్ మలినేని ట్వీట్ చేశారు. ఇక ఈ మధ్యకాలంలో రజనీకాంత్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సూపర్ హిట్ లుగా నిలుస్తున్న సినిమాల దర్శకులకు మ్యూజిక్ డైరెక్టర్లకు నటీనటులకు నేరుగా ఫోన్ చేసి వీలైతే ఇంటికి పిలిపించుకుని అభినందనలు తెలపడమే కాక వీలుకాని పక్షంలో ఇలా ఫోన్లో అభినందనలు తెలుపుతూ అందరికీ ఇష్టుడిగా మారిపోతున్నాడు.


సాధారణంగానే రజినీకాంత్ అంటే దాదాపుగా అందరికీ ఇష్టమే ఆయన వివాదాల జోలికి కూడా వెళ్ళడు. అయితే ఈ మధ్యకాలంలో ఇలా టెక్నీషియన్లను నటినట్టులను అభినందించే విషయంలో ఆయన మరో మెట్టెక్కేస్తున్నారు. గతంలో కూడా లవ్ టుడే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ ను ఇంటికి పిలిపించుకోవడమే కాక శాలువా కప్పి మరీ ఆయనను అభినందించారు రజినీకాంత్. 


Also Read: Rajinikanth's Public Notice: పబ్లిక్ నోటీస్‌ ఇచ్చి మరీ వారికి వార్నింగ్ ఇచ్చిన రజినికాంత్


Also Read: Taraka Ratna Latest Health Update: కాసేపట్లో తారకరత్నకు కీలక వైద్యపరీక్షలు.. ఆ తరువాత హెల్త్ బులెటిన్ విడుదల



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook