Rajinikanth's Public Notice: పబ్లిక్ నోటీస్‌ ఇచ్చి మరీ వారికి వార్నింగ్ ఇచ్చిన రజినికాంత్

Rajinikanth's Public Notice: కాపీ రైట్స్ పరంగా తన పబ్లిక్ నోటీస్‌ని కాదని నిబంధనలు అతిక్రమించిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్టు రజినీకాంత్ తరపు న్యాయవాది ఎస్ ఎలంభారతి తెలిపారు. తన క్లయింట్ రజినీకాంత్ తప్ప మరెవ్వరికీ కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు, ఫోటో, వాయిస్ ఉపయోగించుకునేందుకు అనుమతి లేదని అడ్వకేట్ ఎస్ ఎలంభారతి వెల్లడించారు.

Written by - Pavan | Last Updated : Jan 30, 2023, 10:43 AM IST
Rajinikanth's Public Notice: పబ్లిక్ నోటీస్‌ ఇచ్చి మరీ వారికి వార్నింగ్ ఇచ్చిన రజినికాంత్

Rajinikanth's Public Notice: తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ కూడా మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా తరహాలోనే పబ్లిక్ నోటీస్ ఇచ్చి మరి తన అనుమతి లేకుండా తన పేరు, ఇమేజ్ ఉపయోగించుకునే వారికి వార్నింగ్ ఇచ్చారు. తన అనుమతి లేకుండా తన పేరు కానీ లేదా ఫోటోలు లేదా వాయిస్.. ఇలా ఏవీ ఉపయోగించడానికి వీల్లేదని రజినీకాంత్ స్పష్టంచేశాడు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటో, వాయిస్ వాడుకుని తనకు ఉన్న కీర్తి ప్రతిష్టలను అప్రతిష్టపాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రజినీకాంత్ తన పబ్లిక్ నోటీసులో పేర్కొన్నాడు.

కాపీ రైట్స్ పరంగా తన పబ్లిక్ నోటీస్‌ని కాదని నిబంధనలు అతిక్రమించిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్టు రజినీకాంత్ తరపు న్యాయవాది ఎస్ ఎలంభారతి తెలిపారు. తన క్లయింట్ రజినీకాంత్ తప్ప మరెవ్వరికీ కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు, ఫోటో, వాయిస్ ఉపయోగించుకునేందుకు అనుమతి లేదని అడ్వకేట్ ఎస్ ఎలంభారతి వెల్లడించారు. ఈ మేరకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తరపున శనివారం పబ్లిక్ నోటీస్ జారీచేశారు. 

తన పేరు వాడుకుని కొన్ని వ్యాపార సంస్థలు, ఉత్పత్తి తయారీదారులు, పలు మీడియా మాధ్యమాలు తమ ప్రోడక్ట్స్‌ని ప్రమోట్ చేసుకుంటున్నాయని.. అలా తన అనుమతి లేకుండా తన పేరు వాడుకుని తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగేలా చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రజినీకాంత్ ఈ పబ్లిక్ నోటీస్ ద్వారా హెచ్చరించాడు. లక్షల మంది అభిమానులు ఆరాధించి, అభిమానించే తన పేరును దుర్వినియోగం చేయాలనుకునే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని రజినీకాంత్ స్పష్టంగా తేల్చిచెప్పాడు. 

ఇక రజినీకాంత్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ తమిళ సూపర్ స్టార్ జైలర్ అనే మూవీలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న జైలర్ మూవీలో రజినీకాంత్‌తో పాటు మళయాళం స్టార్ హీరో మోహన్ లాల్ కూడా ఓ అతిథి పాత్రలో కనిపించనుండటం విశేషం. నెల్సన్ డైరెక్ట్ చేస్తోన్న జైలర్ మూవీని తమిళనాట భారీ చలన చిత్ర నిర్మాణ సంస్థగా పేరున్న సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. శివ రాజ్ కుమార్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా భాటియా, రమ్యక్రిష్ణ ఫీమేల్ లీడ్ రోల్స్ పాత్రల్లో కనిపించనున్నారు. రజినీకాంత్ గత చిత్రాల మాదిరిగానే జైలర్ మూవీ కూడా పాన్ ఇండియా వైడ్ హిందీ, తమిళ, తెలుగు, మళయాళం భాషల్లో విడుదల కానుంది.

ఇది కూడా చదవండి : 2024 Sankranthi: అందరి హీరోల కన్నూ 2024 సంక్రాంతి మీదే.. కానీ ఎన్టీఆర్ మాత్రం?

ఇది కూడా చదవండి : Biggest Indian Film: ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కు రంగం సిద్ధం.. ఇక మామూలుగా ఉండదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News