Sai Dhanshika with Amit Tiwari Anthima Theerpu కబాలి సినిమాతో ఫేమస్ అయింది సాయి ధన్సిక. కబాలి చిత్రంలో రజినీకాంత్‌ కూతురిగా నటించి మెప్పించింది. గత ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు కొత్త అవతారంలో వచ్చింది. షికారు సినిమాతో సాయి ధన్సిక కుర్రాళ్ల గుండెలను దోచేసింది. ఇప్పుడు సాయి ధన్సిక బిగ్ బాస్ అమిత్‌తో కలిసి నటిస్తోంది. ఈ ఇద్దరూ జంటగా.. శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్ బ్యానర్ మీద అంతిమ తీర్పు అనే సినిమా రాబోతోంది.ఏ.అభిరాం దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీని డి. రాజేశ్వరరావు  నిర్మిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా  ఈ మూవీ టైటిల్‌ను లాంచ్ చేసేందుకు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో బ్యానర్, టైటిల్ పేరును ప్రకటించారు. అనంతరం బిగ్ బాస్ అమిత్ మాట్లాడుతూ.. నిర్మాతను కలిసినప్పుడు ఆయనలో ఒక ప్యాషన్ చూశానని అన్నాడు. మంచి సినిమా తియ్యాలనే తపన ఆయనలో కనిపించిందని తెలిపాడు. అలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరమని ప్రశంసించాడు.


సాయి ధన్సిక మాట్లాడుతూ.. మీడియా వాళ్ళే సినిమాను సపోర్ట్ చేస్తుంటారు.. అందుకే మీడియాకు థాంక్స్ అని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో అందరి పాత్రలు బాగుంటాయని తెలిపింది. ఒక సినిమాకి  నిర్మాత ఎంత ముఖ్యమో, అవసరమో అర్థమైందని చెప్పుకొచ్చింది. మంచి కథతో మీ ముందుకు వస్తున్నామని తెలిపింది.


డైరెక్టర్ అభిరాం మాట్లాడుతూ.. ఇంతకు ముందు ముత్యాల సుబ్బయ్య చేసిన సినిమాలకు పని చేశానని తెలిపాడు. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో జరుగుతుందని,  సాయి ధన్సిక అద్భుతంగా చేసిందని, కోటి మంచి ట్యూన్స్ ఇచ్చారని, నిర్మాత డి. రాజేశ్వరరావు గారు మంచి సపోర్ట్ చేశారని చెప్పుకొచ్చాడు.


Also Read:  Medical Student Preethi Suicide: ప్రీతి చనిపోయిందా..? అడ్డంగా బుక్కైన పూనమ్ కౌర్..నెటిజన్లు ఫైర్


Also Read: Anchor Rashmi Gautam : రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజన్‌.. యాంకర్ జబర్దస్త్ రిప్లై



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook