Ram Pothineni: రామ్ సినిమాకి నో చెప్పిన రజనీకాంత్.. కారణం అదే..!
Ram Pothineni Double Ismart: డబల్ ఇస్మార్ట్ తో ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు రావడానికి రామ్ పోతినేని సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత.. రామ్ మరొక క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడు. ఈ భారీ చిత్రంలో.. ఓ కీలక పాత్ర కోసం తలైవాని సంప్రదించినట్లు తెలుస్తోంది.
Rajanikanth in Ram film: ప్రస్తుతం రామ్ పోతినేని.. తన కెరీర్ లో మంచి సక్సెస్ కోసం.. ఎదురుచూస్తున్నాడు. ఆగస్టు 15న.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన.. డబల్ ఇస్మార్ట్ శంకర్ విడుదల కాబోతోంది. ఈ మూవీ తర్వాత రామ్.. పి. మహేష్ బాబు డైరెక్షన్ లో.. మూవీ చేయబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఒక కీలకమైన అతిధి పాత్ర కోసం సూపర్ స్టార్ రజనీకాంత్‌ను సంప్రదించినట్లు సమాచారం.
ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మూవీ రజని హీరోగా.. నటించిన కుసేలన్ మూవీ తరహాలో ఉంటుంది అని టాక్. కధ పరయుంబోల్.. అనే మలయాళీ చిత్రం రీమిక్ గా ఈ మూవీ 2008లో తెరకెక్కించారు. ఇందులో జగపతి బాబు ,రజనీకాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాని తెలుగులో సైతం కథానాయకుడుగా విడుదల చేశారు. ఇదే సినిమా బిల్లు బార్బర్‌గా షారుఖ్ ఖాన్,ఇర్ఫాన్ ఖాన్,లారా దత్తా తో 2009 లో హిందీ లో తీశారు.
ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే.. చిన్నతనం నుంచి స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు వృత్తి రీత్యా దూరమవుతారు. ఒకరు చిన్న బాబర్ కాగా మరొకరు స్టార్ హీరోగా ఎదుగుతారు. పల్లెటూరిలో ముగ్గురు పిల్లల తండ్రిగా .. బాబర్ పాత్ర లో జగపతిబాబు నటించిగా..స్టార్ హీరోగా రజనికాంత్ నటించారు.
చిన్ననాటి స్నేహితుడు.. రజనీకాంత్ను కలవడానికి జగపతి బాబు పడే కష్టాలు కథకు కీలకం. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లో డిజాస్టర్ గా మిగిలింది.
ఇప్పుడు రామ్ నటించబోయే.. చిత్రం కూడా ఇంచుమించు ఇదే కథాంశంతో ముందుకు సాగుతుంది అని టాక్. తన అభిమాన నటుడిని కలవడానికి.. గ్రామం నుంచి నగరానికి వచ్చిన ఒక యువకుడు పేస్ చేసే ప్రాబ్లమ్స్ ఈ మూవీ స్టోరీ కి హైలైట్ ఆంట. ఇక ఇందులో స్టార్ హీరో పాత్రలో.. నటించాల్సిందిగా రజనీకాంత్ ను చిత్ర బృందం సంప్రదించారట. కానీ ఈ సినిమా కథ ఆల్రెడీ తాను నటించిన ఫ్లాట్ మూవీ కథ కావటం.. అలానే తను ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల.. రజనీకాంత్ ఈ సినిమాని సున్నితంగా తిరస్కరించారట.
ఇక ఈ పాత్ర కోసం శివ రాజ్ కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణ సారథ్యాన్ని.. మైత్రి సంస్థ వారు నిర్వహిస్తున్నారు. గత కొద్దికాలం గా సరియైన హిట్ లేక బాధపడుతున్న రామ్ కు.. డబల్ ఇస్మార్ట్ సక్సెస్ సాధించడం ఎంతో ముఖ్యం. ఆగస్టు 15న పోటీగా స్టార్ హీరోల సినిమాలు ఏమీ లేవు కాబట్టి..మొదటి షోలో డబల్ ఇస్స్మార్ట్ కానీ మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగలిగితే.. వీకెండ్ కలెక్షన్స్ బాగా వచ్చే అవకాశం ఉంది.
Also Read: YS Viveka Murder Case: వైఎస్ జగన్ చెల్లెలు సంచలనం.. వైఎస్ వివేకా హత్యపై కీలక పరిణామం
Also Read: Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ నిబంధన ఉండదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి