Soundarya Rajinikanth's  Police Complaint: ఈ మధ్యకాలంలో సూపర్ స్టార్ రజినీకాంత్ అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం విజయవాడ వెళ్ళిన ఆయన అక్కడ ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబును కూడా పొగిడి చిక్కుల్లో పడ్డార.  ఆయన వైసీపీని కానీ వైసీపీ ప్రభుత్వాన్ని ఏమీ అనకపోయినా చంద్రబాబుని పొగిడితే తమను తిట్టినట్లే అన్నట్లుగా వైసీపీ మంత్రులు, వైసీపీ సోషల్ మీడియా రజినీకాంత్ ని టార్గెట్ చేసి విరుచుకుపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఇప్పుడు తాజాగా రజనీకాంత్ కూతురి ఇంట్లో దొంగతనం జరిగిన వార్త హాట్ టాపిక్ గా మారుతుంది. ఈమధ్య కాలంలో రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య ఇంట్లో దొంగతనం జరిగిన వార్త తమిళ మీడియా వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. చెన్నైలోని ఐశ్వర్య రజనీకాంత్  నివాసం నుంచి 100 సవర్ల బంగారు ఆభరణాలు, 30 గ్రాములు వజ్ర ఆభరణాలు, నాలుగు కిలోల వెండి, కొన్ని ఆస్తి పత్రాలు ఎవరో దొంగతనం చేశారు.


Also Read: Ravi Krishna Dating: ఆ సీరియల్ హీరోయిన్ తో విరూపాక్ష నటుడి డేటింగ్.. క్లారిటీ ఇచ్చేశాడు!


ఇదంతా పనిమనిషి డ్రైవర్ కలిసి చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ జరిపి అది నిజమేనని తేల్చడమే కాక వాటన్నింటినీ వారిద్దరి నుంచి రికవరీ కూడా చేశారు. ఇది జరిగిన నెల రోజులకే  రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా తెలుస్తోంది.  గత నెలలో అంటే ఏప్రిల్ 23వ తేదీన సౌందర్య రజనీకాంత్ తన నివాసం నుంచి కాలేజీకి తన రేంజ్ రోవర్ కారులో వెళ్ళింది.


అక్కడికి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే తనకు సంబంధించిన మరో కారు తాళంతో పాటు ఒక పౌచ్ కూడా మిస్ అయినట్లు గుర్తించింది. ఈ విషయం గురించి ముందు ఇల్లంతా వెతికిన ఆమె తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ విషయం మీద ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతానికి రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన కుమార్తెల నివాసాల్లో వరుసగా ఇలా చోరీలకు పాల్పడుతున్న ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. 


Also Read: VD12 Copy Poster: విజయ్ దేవరకొండ 12 పోస్టర్ కాపీ పేస్ట్.. అసలు విషయం చెప్పేసిన నాగవంశీ!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook