Rajkummar Rao Engagement: నటి పత్రలేఖతో హీరో రాజ్ కుమార్ రావ్ ఎంగేజ్మెంట్
Rajkummar Rao Engagement: బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. తన ప్రేయసి, నటి పత్రేఖతో శనివారం ఎంగేజ్ మెంట్ జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Rajkummar Rao Engagement: బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాను ప్రేమించిన నటి పత్రలేఖతో శనివారం రాజ్ కుమార్ రావ్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య చంఢీఘర్ లో వీరిద్దరి నిశ్చితార్ధం వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. రాజ్ కుమార్ రావ్.. పత్రలేకను తన మోకాలి మీద కూర్చొబెట్టి ఆమె వేలికి రింగ్ తొడిగాడు. అనంతరం వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
దాదాపుగా ఏడేళ్ల నుంచి రాజ్ కుమార్ రావ్, పత్రలేఖ ప్రేమలో ఉన్నారు. అయితే ఎప్పుడు తమ బంధంపై అధికారికంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో తాము వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరగనుందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
Also Read: RRR Movie Ticket Price: ఏపీలో సినిమా టికెట్ రేట్స్ తగ్గింపు.. ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత అసంతృప్తి
Also Read: Pushpa 4th Song Release Date: ప్రమోషన్స్ లో ‘పుష్ప’రాజ్ జోరు.. నాలుగో సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook