RRR Movie Ticket Price: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రణం రౌద్రం రుధిరం). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలో విడుదల కావాల్సిఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్లు తగ్గింపు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిర్మాత డీవీవీ దానయ్యను కలవరపెడుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు టికెట్టు రేట్స్ తగ్గిస్తే తీవ్ర నష్టం ఏర్పడే అవకాశం ఉందని చిత్ర నిర్మాణసంస్థ అభిప్రాయపడింది. ఇదే విషయమై ట్విట్టర్ లో డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ స్పందించింది.
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్లు తగ్గింపు విషయమై ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అసంతృప్తి వ్యక్తం చేసింది. సినిమా టికెట్టు ధరలు తగ్గింపు నిర్ణయం తమ సినిమాపై తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. అయితే ఈ విషయంలో తమ చిత్రయూనిట్ కోర్టును ఆశ్రయించబోతుందని గత కొద్ది రోజులుగా నెట్టింట్లో వార్తలు వచ్చాయని.. అయితే వాటిలో నిజం లేదని స్పష్టం చేసింది. సినిమా టికెట్టు తగ్గింపు విషయంపై కోర్టును ఆశ్రయించమని.. ఏపీ సీఎం జగన్‌ను కలిసి పరిష్కరించుకుంటామని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది.
It is true that the slashing of ticket prices will affect our film immensely. But we at #RRRMovie have no intention of going to court. We are trying to approach the honourable Andhra Pradesh CM garu and explain our situation for an amicable solution.
— DVV Entertainment (@DVVMovies) November 14, 2021
ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల వ్యవహారం పెద్ద సినిమాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మరీ ముఖ్యంగా సంక్రాంతి బరిలో దిగుతున్న పాన్ ఇండియా సినిమాలకు ఇప్పుడు టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి నిర్మాతలకు నిద్రపట్టకుండా చేస్తోంది. తెలంగాణలో ఎక్స్ట్రా షోస్‌కు టికెట్ రేట్ పెంచుకునేందుకు అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అలాంటి వెసులుబాటు లేదు. అందుకే సంక్రాంతిలో బరిలో రిలీజ్ అవుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టికెట్ రేట్ల విషయంలో కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. కానీ మాకు అలాంటి ఉద్దేశమే లేదంటూ క్లారిటీ ఇచ్చారు ఆర్ఆర్ఆర్ మేకర్స్.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్, ఎమోషనల్ డ్రామా 'ఆర్ఆర్ఆర్'. రామ్‌చరణ్-తారక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఆలియాభట్ , ఒలీవియా మోరీస్ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: Pushpa 4th Song Release Date: ప్రమోషన్స్ లో ‘పుష్ప’రాజ్ జోరు.. నాలుగో సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
Also Read: Rashi Khanna Photos: ‘పక్కా కమర్షియల్’ భామ రాశీఖన్నా శారీ ఫొటోలు వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook