HIT Hindi remake: బాలీవుడ్లో మన ‘హిట్’
టాలీవుడ్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా.. చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్‌ను అందుకున్న ‘హిట్ ’ సినిమా హిందీలో రీమేక్‌కు ఛాన్స్ కొట్టేసింది.
Rajkummar rao: టాలీవుడ్ ( Tollywood ) లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్‌ను అందుకున్న ‘హిట్’ ( Hit ) సినిమా హిందీలో రీమేక్‌కు ఛాన్స్ కొట్టేసింది. ఈ టాలీవుడ్ హిట్ మూవీలో యువ కథానాయకుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రధాన పాత్రలో నటించి అలరించాడు. అయితే ఈ చిత్రానికి శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకుడిగా పరిచయం కాగా.. నేచురల్ స్టార్ నాని (Nani) నిర్మాతగా వ్యవహరించాడు. అయితే హిట్ చిన్న సినిమా అయినప్పటికీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోని మంచి కలెక్షన్లను రాబట్టింది. Also read: Allu Arjun: ఆ కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ?
ప్రస్తుతం ఈ హిట్ మూవీ హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ ( Bollywood ) యంగ్ హీరో రాజ్‌కుమార్ రావ్ ( Rajkummar rao ) లీడ్ రోల్ చేయబోతున్నాడు. తెలుగు హిట్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసి హిందీలో తీయనున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. Also read: RRR Fan Made Sketch: ఎన్టీఆర్ ఫ్యాన్ గీసిన RRR డిజిటల్ ఆర్ట్ చూడండి
ఇదిలాఉంటే.. తెలుగులో దర్శకత్వం వహించిన శైలేషే.. హిందీలో కూడా డైరెక్షన్ చేయనున్నాడు. హిట్ చిత్రం రీమేక్‌ని ప్రముఖ ప్రోడ్యూసర్ దిల్ రాజు (Dil Raju ) నిర్మించనున్నారు. అయితే.. ఈ హిందీ రిమేక్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు 2021లో ప్రారంభంకానున్నట్లు సినీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ హిందీ రీమేక్ హిట్ మూవీకి సంబంధించి తారాగణం, సాంకేతిక విభాగం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos