Allu Arjun: ఆ కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ?

స్టైలిష్ స్టార్  ( Stylish star ) అల్లు అర్జున్ ఇప్పుడిక రాజకీయ నేపధ్యంతో తెరకెక్కనున్న సినిమాలో కన్పించనున్నారు. వైఎస్ఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన యాత్ర చిత్రాన్ని ( YSR biopic Yatra movie )   డైరెక్ట్ చేసిన మహి ఆర్ రాఘవ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా రానున్నట్టు తెలుస్తోంది.  

Updated: Jul 14, 2020, 07:31 PM IST
Allu Arjun: ఆ కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ?

స్టైలిష్ స్టార్  ( Stylish star ) అల్లు అర్జున్ ఇప్పుడిక రాజకీయ నేపధ్యంతో తెరకెక్కనున్న సినిమాలో కన్పించనున్నారు. వైఎస్ఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన యాత్ర చిత్రాన్ని ( YSR biopic Yatra movie )   డైరెక్ట్ చేసిన మహి ఆర్ రాఘవ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా రానున్నట్టు తెలుస్తోంది.

 

యాత్ర ( Yatra ) సినిమాతో పేరు సంపాదించుకున్న దర్శకుడు మహి ఆర్ రాఘవ ( Mahi R Raghava ). ఇతడి దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం సుకుమార్ ( Director Sukumar ) దర్శకత్వంలో వస్తున్న అప్ కమింగ్ మూవీ పుష్ప ( Pushpa movie ) లో  అల్లు అర్జున్ నటిస్తున్నారు. కరోనా సంక్రమణ, లాక్‌డౌన్ నేపధ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దాంతో మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న బన్నీకి...మహి ఆర్ రాఘవ ఓ రాజకీయ నేపధ్యపు కథను విన్పించగా...అల్లు అర్జున్ అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. Also readRRR Fan Made Sketch: ఎన్టీఆర్ ఫ్యాన్ గీసిన RRR డిజిటల్ ఆర్ట్ చూడండి

కేవలం రాజకీయ నేపథ్యం ఉండటమే కాదు... ఇటీవల జరిగిన వాస్తవ సంఘటనలు కూడా ఇందులో ఉంటాయని సమాచారం. ఇక బన్నీ-మహీ ( Banni-Mahi Combination ) కాంబినేషన్  ప్రాజెక్టును నిర్మించేందుకు పీవీపీ ( PVP ) ఆసక్తి చూపిస్తున్నారట. పుష్ప షూటింగ్ తిరిగి ప్రారంభమైన తరువాతే ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఉండనుంది. Also read: Apsara Rani: అప్సరా రాణి గ్లామర్ సీక్రెట్ అదే