ఓంకార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న రాజుగారి గది -2 చిత్రం ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున చాలా స్పెషలో రోల్ లో కనిపిస్తున్నారు. ఈ మూవీలో సమంత‌తో పాటు సీరత్ కపూర్, వెన్నెలకిషోర్, అశ్విన్ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినమాలో ప్రవీణ్, షకలక శంకర్, నరేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కాగా చిత్రం విడుదలతో నాగ్ అభిమానుల్లో సందడి నెలకొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెంటలిస్ట్ పాత్రలో నాగార్జున..


మెంటలిస్ట్ పాత్రలో నాగార్జున ఈ చిత్రంలో నాగార్జున మెంటలిస్టు పాత్రలో కనిపించారు. తన పాత్ర గురించి నాగార్జున మాట్లాడుతూ.... ఇందులో మెంటలిస్టు పాత్ర చేస్తున్నాను. రియల్‌ లైఫ్‌లో అలాంటివారిని ఇద్దరు, ముగ్గుర్ని కలిశాను. వాళ్ళకి ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్స్‌ ఉంటాయి. మీ మనసులో వున్నది ఈజీగా కనిపెట్టేస్తారు. నిజంగా చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది.


దెయ్యం పాత్రలో సమంత 


ఈ చిత్రంలో సమంత దెయ్యం పాత్రలో నటించింది.  నాగార్జున కోడలు  సమంత.... నాగార్జునతో కలిసి ‘మనం' తర్వాత నటించిన సినిమా ఇదే.