Rakhi Sawant Divorce: సినీ ఇండస్ట్రీలో విడాకుల కలవరం.. భర్తతో విడిపోయిన మరో నటి
Rakhi Sawant Divorce: వాలెంటైన్స్ డే రోజున బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఊహించని షాక్ ఇచ్చింది. తన భర్త రితేష్ సింగ్ తో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. వాలెంటైన్స్ డే రోజున ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల ఆవేదనతో ఉన్నట్లు ఆమె తెలిపింది.
Rakhi Sawant Divorce: తరచుగా వివాదాల్లో చిక్కుకునే బాలీవుడ్ నటి రాఖీ సావంత్.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. తన భర్త రితేష్ సింగ్ తో విడిపోతున్నట్లు వాలెంటైన్స్ డే నాడు సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇప్పుడు వీరిద్దరూ విడిపోనున్న వార్త విని ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు.
"నా అభిమానులకు, సన్నిహితులకు నేడు ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను. నేను, రితేష్ సింగ్ భార్యభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. బిగ్ బాస్ షో తర్వాత మా మధ్య చాలా విషయాలు చోటుచేసుకున్నాయి. కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. దీంతో మా మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి. ఈ కారణంగా విడిపోడమే మంచిదని మేమిద్దరం నిర్ణయించుకున్నాం" అని రాఖీ సావంత్ ప్రకటించింది.
అయితే వాలెంటైన్స్ డే రోజున ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల ఎంతో బాధగా ఉన్నట్లు రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది. తనతో విడిపోయిన తర్వాత కూడా రితేష్ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు రాఖీ సావంత్ ఆ నోట్ లో పేర్కొంది.
ఇటీవలే బిగ్ బాస్ 15 సీజన్ లో పాల్గొన్న రాఖీ సావంత్.. తన భర్త రితేష్ సింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. వీరిద్దరూ బిగ్ బాస్ సీజన్ 15 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. రాఖీ సావంత్.. బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించడం సహా ఐటెం సాంగ్స్ తో మెప్పించింది. తెలుగులో నితిన్ హీరోగా నటించిన 'ద్రోణ' చిత్రంలోనూ ఓ ఐటెం సాంగ్ లో రాఖీ సావంత్ మెరిసింది.
Also Read: Megastar Chiranjeevi: శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న చిరంజీవి దంపతులు
Also Read: Neha shetty: అందంతో కుర్రకారు మది దొచేస్తున్న డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook