Raksha Bandhan Gifts Value: రక్షాబంధన్ మరో రెండ్రోజుల్లో ఉంది. ఆగస్టు 11వ తేదీన దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే అన్నాచెల్లెళ్ల వేడుక ఇది. సోదర సోదరీమణుల మధ్య ఉండే అనురాగానికి ప్రతీక. మరి సినీ ప్రముఖుల ఇళ్లలో రక్షాబంధన్ ఎలా జరుపుకుంటారు, బహుమతులు ఎలా ఉంటాయో తెలుసుకుందామా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూవులకు అత్యంత పవిత్రమైన, ప్రాచీనమైన పండుగ రక్షాబంధన్, శ్రావణమాసం పౌర్ణిమ నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన రక్షబంధన్ పండుగ వచ్చింది. సినిమా ప్రముఖులు ముఖ్యంగా బాలీవుడ్ నటీనటులు ఈ పండుగను కుటుంబసభ్యులతో, సోదర సోదరీమణులతో అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. అంతేకాదు ఒకరికొకరు చాలా ఖరీదైన బహుమతులు ఇచ్చుకుంటారు. ఆ బహుమతుల ఖరీదు తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే. 


రక్షాబంధన్ ఉత్సాహంగా జరుపుకునే నటుల జాబితాలో ముందుగా హృతిక్ రోషన్ గురించి చెప్పుకోవాలి. గత ఏడాది రాఖీ సందర్భంగా హృతిక్ రోషన్..తన సోదరికి బహుమతిగా ఇచ్చిన హ్యాండ్‌బ్యాగ్ ఖరీదు అక్షరాలా 4 లక్షలు. ఇక మరో కుటుంబం దివంగత శ్రీదేవి కుటుంబం. అర్జున్ కపూర్ తన సోదరి జాహ్నవి కపూర్‌కు బహమతిగా ఇచ్చిన డైమండ్ సెట్ ఖరీదు ఏకంగా కోటి రూపాయలు.


ఇక ప్రముఖ వెటెరన్ నటుడు శత్రుఘ్మసిన్హా కుమార్తె సోనాక్షి సిన్హాకు ఆమె సోదరుడు ఇచ్చిన హారం ఖరీదు 40 లక్షల రూపాయలు. ఇక క్రికెట్ మరియు సినిమా కుటుంబ నేపధ్యం నుంచి వచ్చిన సైఫ్ అలీఖాన్ సోదరి సోహా అలీఖాన్‌కు గత ఏడాది రక్షాబంధన్ సమయంలో ఇచ్చిన డైమండ్ ఇయర్ రింగ్స్ ఖరీదు 30 లక్షల రూపాయలు. ఇక బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంకా చోప్రాకు ఆమె సోదరుడు సిద్ధార్ధ రాఖీ సందర్భంగా ఇచ్చిన ఒక ఫ్లాట్ ఖరీదు ఏకంగా 10 కోట్ల రూపాయలు.


ఇక బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్..తన సోదరి నిఖత్ ఖాన్, ఫరత్ ఖాన్‌లకు రాఖీ సందర్భంగా గోల్డ్ ఛైన్ బహుమతిగా ఇచ్చాడు. వాటి ఖరీదు 15 లక్షల రూపాయలు. ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు తన చెల్లెలు అర్పిత అంటే చాలా ఇష్టం. ఆమెకు గత ఏడాది రాఖీ సందర్భంగా ముంబైలోని ఓశ్వారా ప్రాంతంలో ఒక ఫ్లాట్ బహుమతిగా ఇచ్చాడు.


Also read: Sita Ramam: ఐ హేట్ యూ దుల్కర్, సీత మీద అరెస్ట్ వారెంట్.. ‘సీతారామం’ గురించి సాయి ధరమ్ తేజ్ నోట్ వైరల్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook