Ram Charan : పదేళ్లుగా ఎంతో ఎదురుచూశాం!.. తండ్రి కాబోతోండటంపై రామ్ చరణ్ కామెంట్స్
Ram Charan About Becoming Father రామ్ చరణ్ ప్రస్తుతం హాలీవుడ్ అడ్డాలో సందడి చేస్తున్నాడు. ఆస్కార్ వేడుకల్లో సందడి చేయబోతోన్న ఆర్ఆర్ఆర్ టీం గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ అయితే గత రెండు వారాల నుంచి అక్కడే ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.
Ram Charan About Becoming Father రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతోన్నాడనే వార్త హాలీవుడ్ సర్కిళ్లలో ఎక్కువగా వైరల్ అవుతోంది. రామ్ చరణ్ వారసుడిని చూడాలని ఎన్నో ఏళ్ల నుంచి మెగా అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి అయి పదేళ్లు దాటింది. అయినా పిల్లలు పుట్టకపోవడంతో రకరకాల కామెంట్లు వచ్చాయి. బిడ్డను ఎప్పుడు కంటారు? అంటూ ఉపాసనకు ప్రశ్నలు ఎదురయ్యేవి. దీనిపై ఉపాసన చాలా సీరియస్ అవుతుండేది.
టైం వచ్చినప్పుడు తామే ఆ విషయాన్ని ప్రకటిస్తామని చెబుతుండేవారు. అలా చివరకు గత ఏడాది చిరంజీవి ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. రామ్ చరణ్ తండ్రి కాబోతోన్నాడంటూ ప్రకటించాడు. ఉపాసన ప్రెగ్నెంట్ అని చెప్పేశాడు. అయితే ఉపాసన సరోగసి ద్వారా పిల్లల్ని కంటోందనే టాక్ వచ్చింది. ఇన్ని నెలలు అయినా కూడా బేబీ బంప్ కనిపించడం లేదేంటి? అని జనాలు ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు.
ఇక తాజాగా ఉపాసన తన డెలివరీ విషయాలు కూడా చెప్పేసింది. ఇండియాలో జరుగుతుందని, డెలివరీ చేసే డాక్టర్ల పేర్లను కూడా చెప్పేసింది. దీంతో అందరి అనుమానాలు పటా పంచలయ్యాయి. ఇప్పుడు రామ్ చరణ్ హాలీవుడ్ మీడియాతో ముచ్చటించాడు.
త్వరలోనే తండ్రివి కాబోతోన్నావ్.. ఆ ఫీలింగ్ ఎలా ఉందని అడిగింది మీడియా. ఈ ప్రశ్నకు రామ్ చరణ్ ఇలా సమాధానం ఇచ్చాడు. చాలా ఆనందంగా ఉంది.. పదేళ్ల నుంచి ఈ రోజు కోసం ఎదురుచూశాం.. అంతా సరైన టైంకు జరుగుతోంది. ఎంతో సంతోషంగా ఉంది అంటూ రామ్ చరణ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
ఇక మార్చి 12న జరగబోయే ఆస్కార్ ఈవెంట్లో ఆర్ఆర్ఆర్ టీం సందడి చేయబోతోంది. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ వస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. అంతే కాకుండా నాటు నాటు పాటను లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చేందుకు కాళ భైరవ, రాహుల్ సిప్లిగంజ్‌లు లాస్ ఏంజిల్స్‌కు వెళ్లనున్నారు.
Also Read: Anasuya Holi Photos: అనసూయ ఇంట్లో ఆనందాల హోలీ.. ఫోటోలు
Also Read: Nysa Devgan Photoshoot: సినిమాల్లోకి రాకముందే ఓపెన్ షోతో రెచ్చిపోతున్న స్టార్ కపుల్ డాటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook