Kamal Haasan and Rajinikanth : లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996లో విడుదలైన యాక్షన్ మూవీ భారతీయుడు.. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విడుదలైన దాదాపు 28 ఏళ్ల తర్వాత.. ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు 2 సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.
జూన్ 13న ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల మే 16వ తేదీన.. సినిమాకి సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ ను.. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది చిత్ర బృందం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పటికి ఎన్నికలు కూడా పూర్తయిపోతాయి కాబట్టి, నెమ్మదిగా భారతీయుడు 2 సినిమా మీద బజ్ పెంచాలని చిత్ర బృందం ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఈవెంట్ కి ఇద్దరు స్టార్ హీరోలు చీఫ్ గెస్ట్ గా రానున్నారు అనే వార్త తెలిసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి ముఖ్య అతిథులుగా సూపర్ స్టార్ రజినీకాంత్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  


రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజెర్ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పైగా కమల్ హాసన్ సినిమా ఈవెంట్ కాబట్టి రామ్ చరణ్ నో చెప్పే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు రజనీకాంత్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే లాగానే కనిపిస్తున్నారు. ఒకవైపు శంకర్ రజినీ కి మూడు బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. మరోవైపు కమల్ హాసన్ ఎప్పటినుంచో ప్రాణ స్నేహితుడు. 


ఏదేమైనా కమల్ హాసన్ సినిమా ఈవెంట్లో రజనీకాంత్, రామ్ చరణ్ వంటి స్టార్లను చూడడానికి అభిమానులు ఇప్పటినుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న భారతీయుడు 2 సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్ధ్, బాబీ సింహా, బ్రహ్మానందం, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రావిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.  ఇక జూన్ లో ఎలాగో భారతీయుడు 2 సినిమా విడుదల అయిపోతుంది కాబట్టి శంకర్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చివరి దశ పనులు, నిర్మాణాంతర పనులు తో బిజీ అయ్యా అవకాశం ఉంది.


Also Read: DE Suspend: మాజీమంత్రి మల్లారెడ్డి మీటింగ్‌లో కరెంట్‌ కట్‌.. ఉద్యోగి పోస్టు ఊస్ట్‌


Also Read: Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటన


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter