Ram Charan Upasana : ఎక్కడికి వెళ్లినా అది కంపల్సరీ తీసుకెళ్తారట!.. ఉపాసన రామ్ చరణ్‌లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
Ram Charan And Upasana at Oscar 2023 రామ్ చరణ్ ఉపాసన ఇద్దరూ కూడా ఆస్కార్ వేడుకల్లో ఎంత సందడి చేశారో అందరికీ తెలిసిందే. సతీసమేతంగా ఈ ఇద్దరూ ఫోటోలకు పోజులిచ్చారు. హాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.
Ram Charan Prays to Lord Sita Rama రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఆస్కార్ వేడుకల్లో ఎంత చూడముచ్చటగా కనిపించారో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ సతీసమేతంగానే ఆస్కార్ వేడుకల్లో హలీవుడ్ మీడియాతో ముచ్చటించాడు. తన భార్యకు ఆరో నెల అని, ఇలా తన బిడ్డ పుట్టక ముందే అదృష్టాన్ని తీసుకొస్తున్నాడని ఎంతో మురిసిపోయాడు రామ్ చరణ్.
అయితే తాజాగా రామ్ చరణ్ ఉపాసనలకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. లాస్ ఏంజిల్స్‌లో వీరిద్దరూ ఉన్న సమయంలో అక్కడి ప్రముఖ మీడియా సంస్థ వెరైటీ మ్యాగజిన్ వారు రామ్ చరణ్ హోం టూర్ చేసినట్టుగా ఉన్నారు. వారు ఉన్న హోటల్‌కు వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చినట్టున్నారు.
దీంతో రామ్ చరణ్ తన ఉన్న రూంని చూపించాడు. ఇక అక్కడే ఈ విషయం బయటకు వచ్చింది. సీతారాముల వారు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఉన్న విగ్రహాలను తాము ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్తామని, పూజలు చేస్తామని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఆ సీతారాముల ప్రతిమలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అసలే మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆంజనేయ స్వామి భక్తులు. చిరంజీవి అయితే ఆ వీరాంజనేయుడికి వీర భక్తుడు. చిరంజీవి అనేది కూడా ఆంజనేయుడికి ఇంకో పేరు అన్న సంగతి తెలిసిందే. అలా మెగా ఫ్యామిలీ ఎక్కువగా ఆంజనేయస్వామిని, రాముల వారిని కొలుస్తుంటారు. అందుకే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనూ ఆంజనేయుడినే చిహ్నంగా పెట్టారు. ఇప్పుడు ఇలా ఎక్కడకు వెళ్లినా కూడా ఆ దేవుళ్లను తమ వెంటే తీసుకెళ్తామని, అక్కడే పూజ చేసుకుంటామని చెప్పడంతో నెటిజన్లు వారి నిష్టకి, భక్తికి సలాం కొట్టేస్తున్నారు.
Also Read: Chiranjeevi Twitter DP : డీపీ మార్చిన చిరంజీవి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook