Ram Charan Become Parents రామ్ చరణ్‌ తాజాగా తండ్రి కాబోతోన్నాడని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించాడు. ఆ ఆంజనేయస్వామి ఆశీస్సులతో తమ ఇంటికి వారసుడు రాబోతోన్నాడని చిరు ప్రకటించాడు. ఈ ప్రకటనతో మెగా అభిమానుల్లో సంతోషాలు రెట్టింపు అయ్యాయి. ఆనందాలు ఆకాశన్నంటాయి. ఎన్నో ఏళ్లుగా ఈ శుభవార్త కోసమే మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



రామ్ చరణ్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా అందరూ ఒకే టైంలో పెళ్లి చేసుకున్నారు. అందరికీ పిల్లలున్నారు. వారంతా కూడా తమ తమ సంతానంతో సందడి చేస్తుంటే.. తమ హీరో రామ్ చరణ్‌ వారసుడి కోసం మెగా అభిమానులు మాత్రం తీవ్రంగా ఎదురుచూడసాగారు. పదే పదే తన మాతృత్వానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవ్వడంతో ఉపాసన కూడా అప్పుడప్పుడు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చేది.


ఉపాసన ప్రెగ్నెన్సీ విషయంలోనూ ఎన్నో రకాలుగా గాసిప్స్ వచ్చేవి. అయితే ఓసారి సద్గురుతో మాట్లాడిన మాటలతో ప్రెగ్నెన్సీ మీద ఉపాసనకు ఉన్న అభిప్రాయం తెలిసి వచ్చింది. పిల్లలను కనకుండా ఉన్న వారే గొప్పొళ్లు అంటూ సద్గురు చెప్పిన మాటలకు ఉపాసన కౌంటర్ వేసింది. ఇదే మాట మా ఇంట్లో చెబితే నన్ను తిడతారు.. అంటూ తనకు పిల్లలను కనడం ఇష్టమే అని పరోక్షంగా చెప్పేసింది.


పిల్లలను ఎప్పుడు కంటాం అనేది తమ ఇష్టమని, ప్రతీది పబ్లిక్‌గా చెప్పుకోవాల్సిన అవసరం లేదని, తమకు నచ్చినప్పుడే ఆ విషయాన్ని బయటకు చెబుతామని ఆ మధ్య ఉపాసన కూడా చెప్పేసింది. చివరకు ఆ ఘడియ రానే వచ్చింది. ఉపాసన తల్లి కాబోతోందని, రామ్ చరణ్‌ తండ్రి కాబోతోన్నాడని చిరంజీవి ప్రకటించేశాడు. మెగా అభిమానుల్లో ఆనందాలను నింపేశాడు. ఇక జూనియర్ రామ్ చరణ్‌ రాబోతోన్నాడంటూ అప్పుడే అభిమానులు సంబరపడుతున్నారు.
Also Read : Vijay Devarakonda Father : విజయ్ దేవరకొండను మళ్లీ గెలికిన బండ్ల గణేష్.. నెటిజన్ల కామెంట్లు వైరల్


Also Read : Mythri Movie Makers IT Raids : మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటి సోదాలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook