Mythri Movie Makers IT Raids : మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటి సోదాలు

IT Raids on Mythri Movie Makers మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాల మీద ఐటీ అధికారులు కన్నేసినట్టు కనిపిస్తోంది. అసలే ఇప్పుడు వరుస చిత్రాలతో మైత్రీ మూవీస్ దూసుకుపోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2022, 04:23 PM IST
  • మైత్రీ మూవీస్‌పై ఐటీ కన్ను
  • సంక్రాంతి బరిలో రెండు చిత్రాలు
  • డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం ప్రారంభం
Mythri Movie Makers IT Raids : మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటి సోదాలు

IT Raids on Mythri Movie Makers టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ అయిన మైత్రీ మూవీస్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నేటి ఉదయం నుంచి  సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప ,శ్రీమంతుడు, సర్కార్ వారి పాట ,రంగస్థలం , జనతా గ్యారేజ్ మూవీలను నిర్మించి భారీ లాభాలను గడించింది. ఇక ఇప్పుడు రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని చిత్రీకరించేందుకు రెడీగా అయింది. 

అయితే సంక్రాంతి బరిలో బాలయ్య వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలను దించుతోంది మైత్రీ మూవీస్. ఈ విషయంలో దిల్ రాజు, మైత్రీ వారి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందనే టాక్ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఈ ఐటీ రైడ్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వీటి వెనుకున్నది ఎవరో అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇవన్నీ సర్వసాధారణమే అని ఇంకొంత మంది అంటున్నారు.

పది మంది ఐటీ అధికారుల బృందం కలిసి ఈ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఐటీ అధికారులతో పాటు సోదాల్లో జిఎస్టి అధికారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. మైత్రిస్ మూవీస్ నిర్మించిన సినిమాల ఆదాయ వ్యయాలపై ఐటి ఆరా తీస్తోంది. మైత్రిస్ మూవీస్ కి సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. 

ఇప్పటికే పలు భారీ సినిమాలను నిర్మించిన మైత్రి మూవీస్.. ఇప్పుడు చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ తో వీరసింహ రెడ్డి నిర్మించింది. ఈ సినిమాలకు వందల కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా మైత్రిస్ మూవీస్ సబ్మిట్ చేసిన రిటర్న్స్ ను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.

అసలే ఇప్పుడు మైత్రీ వారు కొత్తగా డిస్ట్రిబ్యూషన్‌లోకి దిగారు. నైజాం మీద పట్టు సాధించేందుకు ఈ సంక్రాంతిని వాడుకుంటున్నారు. చిరు, బాలయ్య సినిమాలను సొంతంగా రిలీజ్ చేసి భారీ లాభాలను గడించాలని చూస్తున్నారు. పుష్ప సినిమాతో మైత్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read : Vijay Devarakonda Father : విజయ్ దేవరకొండను మళ్లీ గెలికిన బండ్ల గణేష్.. నెటిజన్ల కామెంట్లు వైరల్

Also Read : Raviteja As Vikram Sagar ACP : మాస్ లుక్, తెలంగాణ యాస.. వాల్తేరు వీరయ్యకు ధీటుగా రవితేజ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News