Ram Charan Comments on Producers: నిర్మాతల గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ వరంగల్ లో ఘనంగా నిర్వహించగా ఆ వేడుకకు రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాతల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  వాస్తవానికి చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన నటించిన సినిమాల్లో వాల్తేరు వీరయ్య భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ దాటేసిన ఈ సినిమా మరింత ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హన్మకొండలో ఈ సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించగా ఆ వేడుకకు ఎర్రబెల్లి దయాకర్ రావు సహా పలువురు ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అయితే ఈ వేదిక మీద నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ముందుగా తన తండ్రి సౌమ్యుడు ఆయన క్వైట్ గా ఉంటారని అందరూ అనుకుంటారు కానీ ఆయన క్వైట్ గా ఉంటేనే ఇంత మంది వచ్చారు.


ఆయన గనుక పిడికిలి బిగించి మాట్లాడితే ఏమవుతుందో ఇతరులకు తెలియదు కదా అని పేర్కొనడమే కాదు ఆయన క్వైట్ గా ఉంటారేమో ఆయన వెనుక ఉండే మేము క్వైట్ గా ఉండం, ఇది చాలా క్వైట్ గా చెబుతున్నా అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవి ఇద్దరూ సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాతలని ఎంతో ఇష్టపడి డెడికేషన్ తో సినిమాలు చేస్తారని చెప్పుకొచ్చారు. వారిలో మరే నిర్మాత చేయలేరని పేర్కొన్న రామ్ చరణ్ తేజ, మైత్రి మూవీ మేకర్స్ లో చేసిన అందరు హీరోలకి మీరు హిట్లు ఇచ్చారని చెప్పుకొచ్చారు.


అయితే కొందరు నిర్మాతలు ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ను చూసి నేర్చుకోవాలని, సినిమా ఎలా తీయాలి? సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి? అనే విషయాలను వీరి దగ్గర నేర్చుకోవాలని పేర్కొన్నారు. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిల్ రాజు మొదలు బండ్ల గణేష్ వరకు అనేక మందిని ఆయన ఉద్దేశించి మాట్లాడి ఉండవచ్చు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read: Jr NTR to Bangalore: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి..బెంగళూరు బయలుదేరిన ఎన్టీఆర్


Also Read: Taraka Ratna Health Update by NTR: తారకరత్న ఆరోగ్యం పై ఎన్టీఆర్ ప్రకటన..ఎక్మో లేదు కానీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook