Game Changer Shooting: రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ ఆ తరువాత ఆచార్య చిత్రంతో డిజాస్టర్ చవిచూశాడు. ఇక ప్రస్తుతం ఈ హీరో శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ అవుతూనే వస్తోంది. శంకర్ కమల్ హాసన్ భారతీయుడు 2 చిత్రంపై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండటంతో ఈ చిత్రం అవుతోందని చాలా రోజుల నుంచి వార్త వస్తూనే ఉంది. కాగా ప్రస్తుతం భారతీయుడు షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోతూ ఉండటంతో ఇంకా గేమ్ చేంజర్ చిత్రంపై కాన్సెంట్రేట్ చేసి ఈ సినిమాని దసరాకి విడుదల చేయాలి అనుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమాల విషయం పక్కన పెడితే ప్రస్తుతం రామ్ చరణ్ అభిమాని చేసిన ఒక పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 


ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్  హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇస్నాపూర్, పాశమైలార లో  జరుగుతుంది. మెగా పవర్ స్టార్ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలియడంతో అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున చరణ్ ని చూడటానికి తరలి వస్తున్నారు. షూట్ ప్లేస్ నుంచి కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ నేపథ్యంలో నిన్న రాత్రి గేమ్ ఛేంజర్ షూట్ ముగించుకొని రామ్ చరణ్ తన ఇంటికి బయలుదేరగా కొంతమంది అభిమానులు చరణ్ కారుని వెంబడించారు. అయితే వాళ్లకు అందకుండా చరణ్ ఫాస్ట్ గా వెళ్ళిపోతాడేమో అనుకున్నారు అభిమానులు. కానీ మన మెగా పవర్ స్టార్ అలా చేయలేదు.. వారందరిని చూసిన వెంటనే.. కార్ ని స్లో చేసి కార్ విండో దించి మరి అక్కడ ఉన్న అభిమానులకు అభివాదం చేసి దయచేసి జాగ్రత్తగా వెనక్కి వెళ్ళండి అని చెప్పాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


 



మామూలుగా వేరే హీరోలైతే ఫ్యాన్స్ వెంబడిస్తే కార్ ని ఇంకా ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారేమో, రామ్ చరణ్ మాత్రం  అభిమానులని పలకరించి వెళ్ళాడు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


Also Read Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ


Also Read Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మరోసారి హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అసలేం జరిగిందంటే..?


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter