Balakrishna Upcoming Movies: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సన్నివేశాలు యాదృచ్ఛికంగా జరిగినా సరే అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. మరికొన్ని విషయాలు సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్ గా కొనసాగుతూ ఉంటాయి. అయితే అందులో ఏవి నిజమవుతాయో? ఏవి అనుకోకుండా జరిగిపోతాయో? చెప్పని పరిస్థితులు.. ఇదిలా ఉండగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదవలేదు.. ఫలానా హీరో , ఫలానా హీరోయిన్, ఫలానా కాంబినేషన్,  ఫలానా ఫెస్టివల్,  టైటిల్ , టైమింగ్ ఇలా ఏదో ఒక విషయంలో సెంటిమెంట్ లు ఫాలో అవుతూ ఉంటారు సినీ ప్రముఖులు. అయితే ఒక్కొక్కసారి అలా ఫాలో అయిన సెంటిమెంట్ బెడిసి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా నందమూరి,  మెగా హీరోలకు సంబంధించిన సినిమాలు ఈ ఏడాది చివర్లో వరుసగా విడుదలవుతున్నాయి.. ముఖ్యంగా ఎన్టీఆర్,  బాలకృష్ణ,  రామ్ చరణ్,  చిరంజీవి వరుస పెట్టి తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సరిగా ఏడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సీన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ కాబోతోందని టాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. 



సరిగ్గా ఏడేళ్ల క్రితం అంటే 2016లో మెగా - నందమూరి హీరోలైన ఎన్టీఆర్,  రామ్ చరణ్, చిరంజీవి,  బాలయ్య సినిమాలు వరుసగా విడుదలై మంచి సక్సెస్ అందుకొని రికార్డులు సృష్టించాయి. 2016 సెప్టెంబర్ లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ , డిసెంబర్లో రామ్ చరణ్ ధ్రువ,  ఆ తర్వాత 2017 సంక్రాంతికి చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150, 2017 జనవరి 12న బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు విడుదలై అన్నీ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అటు మెగా ఇటు నందమూరి ఫ్యామిలీలు సంబరాలు చేసుకున్నాయి. ఇప్పుడు ఇదే ఆర్డర్లో మరోసారి వీరి కొత్త సినిమాలు రాబోతూ ఉండడం గమనార్హం. 


 సెప్టెంబర్ లో ఎన్టీఆర్ దేవర, డిసెంబర్ లో రామ్ చరణ్  గేమ్ ఛేంజర్, 2025 సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర , బాలకృష్ణ బాబీతో చేస్తున్న NBK 109 చిత్రాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలపై మంచి బజ్ కూడా క్రియేట్ అయింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ సీన్ మళ్లీ రిపీట్ అవుతుందని సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఫాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. మరి ఏడేళ్ల క్రితం సీన్ రిపీట్ అవుతోంది. కానీ ఏడేళ్ల క్రితం అందుకున్న సక్సెస్ ను  ఇప్పుడు ఈ నలుగురు హీరోలు అందుకుంటారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. మరి ఈ సీన్ రిపీట్ అవ్వడమే కాదు ఆ విజయాలు కూడా రిపీట్ అవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి ఫలితాలు ఎలా ఉన్నాయో చూడాలి.


Also Read: Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్‌ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ


Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్‌, బ్యాంకింగ్‌, టెలికాం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter