Game Changer release date: గత కొంతకాలంగా స్టార్ డైరెక్టర్ శంకర్ రెండు స్టార్ హీరోల సినిమాలతో రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు ఈ విషయం ఇరు హీరోల అభిమానులకి ఏమాత్రం నచ్చడం లేదు. మరోవైపు శంకర్ కూడా కొన్నిసార్లు ఒక సినిమాకి ప్రాధాన్యత ఇస్తూ మరొకసారి ఆ సినిమాని పూర్తిగా హోల్డ్ లోకి పెట్టేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే స్టార్ డైరెక్టర్ శంకర్ ఒకవైపు లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా 1996లో విడుదల ఈ బ్లాక్ బస్టర్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమా చేస్తున్నారు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమా కూడా చేస్తున్నారు.


ఈ రెండు సినిమాల అప్డేట్ ల కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కొద్దిరోజులు ఒక సినిమాకి ప్రాధాన్యత ఇచ్చి మరో సినిమాని పూర్తిగా హోల్డ్ లోకి పెట్టేస్తున్నారు శంకర్. దీంతో ఇరు వర్గాల అభిమానులు నిరాశ చెందుతూనే వస్తున్నారు. తాజాగా ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితి ఎదురైంది.


తాజాగా భారతీయుడు 2 సినిమాని తెలుగులో జూలై 12న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో కమల్ హాసన్ అభిమానులు బాగానే సంతోషించినప్పటికీ రామ్ చరణ్ అభిమానులు మాత్రం గేమ్ చేంజర్ సినిమా విడుదల తేదీ గురించి శంకర్ ని ప్రశ్నిస్తున్నారు. 


ఇండియన్ 2 సినిమా విడుదల తేదీని ప్రకటించారు బాగానే ఉంది కానీ గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఏంటి? ఆ సినిమాకి ఎప్పుడు మోక్షం కలుగుతుంది అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ 2 సినిమా ని పక్కన పెట్టి కేవలం గేమ్ చేంజర్ సినిమా మీద మాత్రమే దృష్టి పెట్టి ఉంటే ఈపాటికి సినిమా విడుదల అయిపోయేది అని రామ్ చరణ్ అభిమానుల అభిప్రాయం.


అలా కాకుండా రెండు సినిమాలని ఒకేసారి తీస్తూ శంకర్ రెండు సినిమాలకి సరైన న్యాయం చేయడం లేదు అని అభిమానులు అంటున్నారు. మరి ఫాన్స్ సంతోషం కోసమైనా శంకర్ గేమ్ చేంజర్ సినిమా విడుదల తేదీ ని ప్రకటిస్తారో లేదో చూడాలి. ఏదేమైనా ఇండియన్ 2 సినిమా నే ముందు విడుదల అవుతుంది. ఈ సినిమా తరువాతే గేమ్ చేంజర్ సినిమా గురించి అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


అన్నీ అనుకున్నట్లు జరిగితే గేమ్ చేంజర్ సినిమా దసరాకి విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా కోసం శంకర్ ఎక్కువ సమయాన్ని కేటాయించి బాగా తీస్తున్నారని చెప్పుకోవచ్చు కానీ మరోవైపు సినిమా డిలే అయ్యే కొద్ది నిర్మాతలు కూడా నష్టపోతూనే ఉంటారు. మరి గేమ్ చేంజర్ విషయంలో శంకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.


Also Read: Kavtiha: కల్వకుంట్ల కవితకు మళ్లీ నిరాశే! కానీ ఇక్కడే భారీ ట్విస్ట్‌.. ఏం జరిగిందంటే?


Also Read: Graduate MLC Election: బ్లాక్‌ మెయిలర్‌ తీన్మార్ మల్లన్న వద్దు.. గోల్డ్‌ మెడలిస్ట్‌ రాకేశ్ రెడ్డిని గెలిపించండి



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter