Game Changer Release Date: శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మొట్టమొదటి సినిమా గేమ్ చేంజర్. ఈ కాంబినేషన్ గురించి ప్రకటన వచ్చినప్పటి నుంచి.. సినిమా మీద మంచి అంచనాలు వచ్చాయి. నిన్న మొన్న భారతీయుడు 2 సినిమా విడుదలకి ముందు వరకు.. అంతా బాగానే ఉంది. కానీ భారతీయుడు 2 విడుదలయ్యాక మాత్రం పరిస్థితులు మారిపోయాయి. కమల్ హాసన్ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు 2 డిజాస్టర్ గా నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో శంకర్ సినిమాల మీద నమ్మకం పోయింది. శివాజీ సినిమా తర్వాత శంకర్ చాలా సినిమాలు చేశారు కానీ.. కమర్షియల్ గా ఏవి వర్క్ అవుట్ అవ్వలేదు. మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏమవుతుందో అని.. మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరువైపు చిత్ర బృందం కూడా.. సినిమా మీద ఆసక్తి పెంచడానికి ఎలాంటి కృషి చేయడం లేదు. 


ఇవాళ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కియారా అద్వాని పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆమె పోస్టర్ ను.. విడుదల చేస్తూ సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్ర పేరు జాబిలమ్మ అని పోస్ట్ చేసింది. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చిత్ర బృందం కొత్త పోస్టర్ ఏమి విడుదల చేయలేదు. అది జరగండి పాటలో ఉన్న స్టిల్ కావడం ఫాన్స్ ని నిరాశకు గురిచేసింది. 


అప్పుడప్పుడు సినిమాకి సంబంధించిన లీకులు బయటకు వస్తున్నాయి కానీ.. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడం అభిమానులకు మరింత చిరాకు తెప్పిస్తోంది. మరి ఇప్పటికైనా గేమ్ చేంజర్ బృందం తమ ప్రమోషన్స్ విషయంలో చేంజెస్ చేస్తుందో లేదో వేచి చూడాలి. అసలే డిసెంబర్ లో సినిమా విడుదల అవుతుంది అని ప్రకటించారు. ఎక్కువ సమయం కూడా లేదు కాబట్టి.. ఇకనైనా సినిమా మీద బజ్ పెంచే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అని ఫాన్స్ అభిప్రాయం.


Read more: Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter