Venomous snake died of heart attack video goes viral: చాలా మంది ఉరుకులు, పరుగుల మధ్య జీవనం గడుపుతున్నాయి. సమయానికి తిండి, కంటి నిండా నిద్ర అనేవి కరువయ్యాయని చెప్పుకొవచ్చు. లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. తినాల్సిన సమయంలో నిద్రపోతారు. నిద్ర పోవాల్సిన సమయంలో మెల్కొని జాబ్ లు చేస్తుంటారు. దీంతో జీవ గడియారం పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో చిన్న వయస్సులోనే అనేక వ్యాధులు వస్తుంటాయి. కొందరు డయాబెటిక్, ఊబకాయం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మరికొందరిలో చిన్న వయస్సులోనే ముఖంపై ముడతలు, తెల్లవెంట్రుకలు కూడా వస్తున్నాయి.
క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా గురౌతున్నారు. ఈ నేపథ్యంలో.. ఇటీవల కాలంలో చాలా మంది గుండెపోటులకు గురౌతున్నారు. అప్పటివరకు బాగానే ఉన్నవారు కాస్త ఒక్కసారిగా కుప్పకూలీపోతున్నారు. డ్యాన్స్ లు చేస్తున్నప్పుడు, జిమ్ లకు చేస్తున్నప్పుడు చాలా మంది గుండెపోటుతో చనిపోయిన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది గుండె పోటుతో విగత జీవులుగా మారిపోయిన ఘటనలు కొకొల్లలు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనుషులే కాదు.. నోరులేని జీవాలు సైతం గుండెపోటుతో చనిపోతాయా.. అంటూ కొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఒక పాము అప్పటి వరకు బాగానే.. ఉండి ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ.. గిల గిల్లకొట్టుకొంటూ చనిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
ఒక పాము జనావాసాల్లోకి వచ్చింది. ఇంతలో కొందరు పాములను పట్టుకునే వారికి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అతను పామును బంధించడానికి వచ్చాడు. ఇంతలో ఏమైందో ఏంటో కానీ పాము ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ వింతగా ప్రవర్తించింది. అంతేకాకుండా.. నేలపై పడి గిల గిల కొట్టుకుంది. అక్కడున్న వారంతా ఆశ్చర్యంతో చూస్తు ఉండిపోయారు. కొందరు మాత్రం ఆ పాముకు ఏదో వింత వ్యాధి సోకి ఉండోచ్చు అంటున్నారు. మరికొందరు మాత్రం పాముకు గుండె పోటు వచ్చిందంటూ కూడా మాట్లాడుకుంటున్నారు.
దీనిపై పశువైద్యులు ఏమన్నారంటే?
మనుషులు, జంతువుల్లాగే పాములకు కూడా గుండె ఉంటుందని వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు. ఇవి సరీసృపాల వర్గానికి చెందిన కావున వాటికి కూడా హృదయం ఉంటుందని వెల్లడిస్తున్నారు. గుండె ఉందంటే సాధారణంగానే దాని సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. శరీరానికి తగినట్లుగా గుండె రక్తాన్ని సరఫరా చేయకపోవడం లేదా ఇతర అనేక రకాల వల్ల వాటికి కూడా గుండెపోటు వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.