Ram Charan: రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ సినిమా రీ-రిలీజ్.. ఇంతకీ ఏ సినిమా అంటే!
Ram Charan Birthday: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న హీరో రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రామ్ చరణ్ క్రేజ్ ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. తాజాగా ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అవుతోంది అనే వార్త ఆయన అభిమానులను ఖుషి చేస్తొంది.
Ram Charan Upcoming Movie Update: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ అందుకున్న హీరో రామ్ చరణ్. ఆ తరువాత ఇప్పటివరకు రామ్ చరణ్ నటించిన ఫుల్ లెన్త్ సినిమా అయితే రాలేదు. మధ్యలో ఆచార్య చిత్రం వచ్చిన అందులో రామ్ చరణ్ కేవలం గెస్ట్ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఈ హీరో శంకర్ దర్శకత్వంలో రానున్న గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. కానీ ఈ చిత్రం దాదాపు మూడు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది.
కాగా మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు మెగా పవర్ స్టార్ అభిమానులు. ఈ క్రమంలో ఈ వార్తతో పాటు రామ్ చరణ్ అభిమానులకు మరో శుభవార్త కూడా వినిపిస్తోంది. అదేమిటి అంటే ఆర్ఆర్ఆర్ సినిమా కన్నా ముందు రామ్ చరణ్ రాజమౌళితో చేసిన చిత్రం మగధీర. ఆ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కేవలం 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఏకంగా 100 కోట్లు సాధించి రామ్ చరణ్ కెరియర్ లో మొదటి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలవడం విశేషం.
ఇప్పటికీ ఈ చిత్రం టీవీలో ప్రచారం అయితే చూసేవారు ఎంతోమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. మార్చ్ 27 కన్నా ముందు రోజు అనగా మార్చి 26న ఈ చిత్రం రీ రిలీజ్ కానుంది అని తెలుస్తోంది.
విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేతలు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎక్కువ థియేటర్స్ లో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇదే విషయాన్ని వీరిద్దరూ అధికారికంగా సోషల్ మీడియాలో కూడా ప్రకటించారు. ఈ అవకాశం వారికి కనిపించినందుకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి ఈ వార్త విని రామ్ చరణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Also read: AP & TS SSC Exams 2024: నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook