Ram Charan Narthan Movie Script Work Started: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఒకపక్క ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నా తర్వాత ఆచార్య సినిమాతో మరో డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతానికి ఆయన శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతాను అంటూ ఆయన అభిమానులతో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులంతా ఆనందంలో మునిగిపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోపక్క ఆయన తండ్రి కాబోతున్నట్టు ప్రకటించడం కూడా మెగా అభిమానులందరికీ ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక తాజాగా ఆయన సినిమాలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ అయితే తెర మీదకు వచ్చింది. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో సినిమా క్యాన్సిల్ చేసి బుచ్చిబాబుతో ఒక సినిమా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు రామ్ చరణ్ తేజ్.


అయితే ఆ మధ్య ఆయన ఒక కన్నడ దర్శకుడుతో సినిమా చేయబోతున్నాడు అని ప్రచారం జరిగింది కానీ ఆ విషయం మీద ఎలాంటి అధికారిక క్లారిటీ అయితే రాలేదు. తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు కన్నడ దర్శకుడి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలైనట్లుగా తెలుస్తోంది.


యువి క్రియేషన్స్ నిర్మాణంలో కన్నడ డైరెక్టర్ నర్తన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే ఒక లైన్ గా చెప్పిన దాన్ని రామ్ చరణ్ ఒకే చేశాడని దీంతో డైరెక్టర్ దాన్ని ఫైనల్ గా ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ గా తయారు చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని డైరెక్టర్ ఫ్యాన్ బేస్ వల్ల కన్నడ రాష్ట్రంలో రామ్ చరణ్ ఫ్యాన్ బేస్తో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం ఖాయమే.


ఇక తమిళ, మలయాళ,  హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమా కావడం తర్వాత వస్తున్న రాంచరణ్ 15వ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసే ఆలోచన అయితే చేస్తున్నారు మేకర్స్. చూడాలి ఈ సినిమా అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు అనేది.


Also Read: Kajal Aggarwal Lip Kiss: కొడుకు పక్కనుండగానే భర్తకు కాజల్ లిప్ లాక్.. ఫోటో వైరల్!


Also Read: Shraddha Walker-Tunisha Sharma: తునీషా శర్మ సూసైడ్ కు కారణమైన శ్రద్దా వాకర్... షాకింగ్ విషయం బయటపెట్టిన ప్రియుడు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.