Kajal Aggarwal Lip Kiss to her Husband Gautham Kichlu: సినీనటి కాజల్ అగర్వాల్ ఉత్తరాది భామ అయినా దక్షిణాదిలోనే సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. ఇక తెలుగులో లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో హీరోయిన్ గా లంచ్ అయిన ఆమె ఆ తర్వాతి కాలంలో వరుస హీరోయిన్ వరుసగా అనేక సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ హోదా అయితే దక్కించుకుంది. ఒక రకంగా తెలుగులో నిన్న మొన్నటి వరకు కూడా ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్ లుగా నిలుస్తూ వచ్చాయి.
అయితే ఒకరకంగా నేనే రాజు నేనే మంత్రి తర్వాత ఆమె చేస్తున్న సినిమాలేవి ఆమెకు కలిసి రావడం లేదు. ఇటీవల ఆమె చేసిన కవచం, మోసగాళ్లు, హే సినామిక అనే సినిమాలు ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు. సినిమాల్లో సక్సెస్ రేట్ తగ్గింది అని భావించిన వెంటనే తాను తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకోబోతున్నానని అధికారికంగా ప్రకటించి 2021 అక్టోబర్‌లో గౌతమ్ కిచ్లు అనే ఒక ముంబై బేస్డ్ బిజినెస్ మెన్ మీద వివాహం చేసుకుంది.
ఆ తర్వాత తన భర్తతో కలిసి ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ వచ్చింది. తర్వాత తాను తల్లి కాబోతున్నానని ప్రకటించిన ఆమె ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన ఒక బుడ్డోడికి జన్మనిచ్చింది. ఆ బుడతడికి నీల్ అనే పేరు పెట్టారు. అయితే తాజాగా తన భర్త, కుమారుడితో కలిసి ఉన్న ఒక ఫోటోని కాజల్ అగర్వాల్ షేర్ చేసింది.
కాజల్ అగర్వాల్ భర్త గౌతం కిచ్లు తమ కుమారుడు నీల్ ని ఎత్తుకొని ఉండగా కాజల్ అగర్వాల్ తన భర్తకు లిప్ లాక్ ఇస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నాకు క్రిస్టమస్ కి కావాల్సింది ఇదే అంటూ తన భర్త నుంచి తాను ప్రేమ కోరుకుంటున్నట్లుగా హింట్ ఇచ్చిం.ది ఇక ఈ ఫోటో మీద రకరకాల కామెంట్లు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఉన్న ఫోటో మీద మీరు కూడా ఒక లుక్ వేయండి మరి.
Also Read: Venugopal : ఐసీఐసీఐ కేసులో వేణుగోపాల్ ధూత్ అరెస్ట్.. వారు అరెస్టైన మూడు రోజులకే?
Also Read: BRS MPTC: సిద్దిపేట జిల్లాలో అధికార పార్టీ నేత దారుణహత్య.. నరికి నరికి చంపేశారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.